AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda Title Song: బాలయ్య అభిమానులకు మాస్‌ కిక్‌.. అలరిస్తోన్న అఖండ టైటిల్‌ సాంగ్‌..

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ'. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు...

Akhanda Title Song: బాలయ్య అభిమానులకు మాస్‌ కిక్‌.. అలరిస్తోన్న అఖండ టైటిల్‌ సాంగ్‌..
Akhanda movie title song
Basha Shek
|

Updated on: Nov 08, 2021 | 1:31 PM

Share

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ’. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్‌ సాంగ్‌ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా తాజాగా ఈ పాట పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం.

‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్‌ నందమూరి అభిమానులకు మంచి మాస్‌ కిక్‌ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా పాటలో బాలయ్య వాకింగ్‌ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను శంకర్‌ మహదేవన్‌, సిద్ధార్థ్‌ మహదేవన్‌, శివమ్‌ మహదేవన్‌ అద్భు్తంగా ఆలపించారు. తమన్‌ సంగీత సారథ్యం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి హిట్‌ సినిమాల తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. దీంతో నందమూరి అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also read:

Entertainment: డేగల బాబ్జీ వచ్చేశాడు.. యాభై దెయ్యాలు బెదిరిస్తున్నాయంటున్న బండ్ల గణేష్‌ ..

Acharya: నీలాంబరిపై మనసు పడిన సిద్ద.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న రామ్ చరణ్ పూజ హెగ్డే పోస్టర్స్.. (ఫొటోస్)

Entertainment: ఈ వారం థియేటర్‌/ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!