AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రభుదేవాను మించిపోయిన ఎలుగుబంటి.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..

Bear Dance Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి

Viral Video: ప్రభుదేవాను మించిపోయిన ఎలుగుబంటి.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..
Bear Dance Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2021 | 1:23 PM

Share

Bear Dance Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. ఈ క్యూట్ వీడియోలు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఎలుగుబంటికి చెందిన వీడియోలను మనం చాలానే చూసుంటాం.. వాటిలో కొన్ని ఎలుగుబంట్లు ఎంజాయ్ చేస్తూ కనిపించాయి. ఓ ఎలుగుబంటి అయితే ఏకంగా ఇంట్లోకి వెళ్లే కేఎఫ్సీ చికెన్‌ను ఇష్టంగా ఆరగించింది. తాజాగా ఓ ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అయిన వీడియోలో ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ.. అది నిజంగా డ్యాన్స్ చేయదు. దాని వీపునకు దురద రావడంతో పోల్‌కు.. రుద్దుకుంటూ కనిపిస్తుంది. ఈ వీడియోను గత నెల చివర్లో ఎర్త్ ఫోకస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by EARTH FOCUS (@earthfocus)

అయితే.. ఈ వీడియోను కారులో ఉన్న వ్యక్తి రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి దానిని తీసినట్లు కనిపిస్తుంది. అయితే.. ఈ వీడియోను చూసినవారంతా ఎలుగుబంటి డ్యాన్స్ చేస్తున్నట్లు అనుకుంటారు కానీ.. అది తన వీపునకు చికాకు కలిగించడంతో.. స్తంభానికి వీపును గీక్కుంటూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎలుగుబంటి గోక్కున్నట్లు లేదని.. డ్యాన్స్ వేసినట్లు ఉందని పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ వీడియోను ఇప్పటికే 31 మిలియన్ల మంది వీక్షించారు.

Also Read:

Viral News: గొర్రె కథ విని.. రూ.2 లక్షలకు విక్రయించిన రైతు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..? వీడియో..

Watch Video: కైలాసగిరి కాదు.. విషపు నగరి.. కాలుష్యపు నీటిలో పుణ్యస్నానాలు.. వీడియో వైరల్

Follow Us
గ్యాస్‌ కష్టాలకు చెక్‌.. LPG బుకింగ్‌ డేస్‌ లిమిట్‌ తగ్గింపు!
గ్యాస్‌ కష్టాలకు చెక్‌.. LPG బుకింగ్‌ డేస్‌ లిమిట్‌ తగ్గింపు!
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?