AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కైలాసగిరి కాదు.. విషపు నగరి.. కాలుష్యపు నీటిలో పుణ్యస్నానాలు.. వీడియో వైరల్

Yamuna River Viral Video: ఆకాశగంగలో పొంగుతున్న పాలపొంగులు కావివి.. హిమగిరుల్లో తేలియాడుతున్న మంచు పలకలు అసలే కావు.. మీరు చూస్తున్నది

Watch Video: కైలాసగిరి కాదు.. విషపు నగరి.. కాలుష్యపు నీటిలో పుణ్యస్నానాలు.. వీడియో వైరల్
Yamuna River
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2021 | 12:28 PM

Share

Yamuna River Viral Video: ఆకాశగంగలో పొంగుతున్న పాలపొంగులు కావివి.. హిమగిరుల్లో తేలియాడుతున్న మంచు పలకలు అసలే కావు.. మీరు చూస్తున్నది విషపు నురగలు. అవును మీరు చూస్తున్నది యమునా నదిలోని దృశ్యాలు.. ఆ నీటిలోనే మహిళలు పుణ్యస్నానాలు ఆచరిస్తుండటం చూసి.. పలువురు నీటి కాలుష్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సోమవారం దేశమంతటా కార్తీకమాస పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు ఉదయాన్నే సుప్రసిద్ధ నదుల వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో భాగంగా ఉత్తరభారతదేశంలో ఛత్‌పూజలు కూడా ప్రారంభయ్యాయి. అయితే.. దేశరాజధాని ఢిల్లీలోని మహిళలు యమునా నదికి చేరుకొని కార్తీక మాస పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా యమునా నదిలో కనిపించిన దృశ్యాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కాలుష్యం బారిన పడిన యమునలో ఈ విధంగా నురగ.. తెల్లని మబ్బుల్ని తలపించేలా నదిలో కొట్టుకువెళ్తుంటే.. ఆ నురగలోనే మహిళలు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఒకప్పుడు యమునా తీరాన.. సాయంకాల వేళ సేదదీరడానికి వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఆ వైపునకు చూడాలన్న భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఛత్‌ పూజల్లో మహిళలు మురుగు నీటిలోనే స్నానాలు ఆచరించి పూజలు చేశారు.

అమ్మోనియా స్థాయి పెరగడం, వ్యర్థాల వల్ల విషపు నురగలు ఈవిధంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. హర్యానా నుంచి ఎక్కువగా వ్యర్థాలు యమునాలో కలుస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. విషపు నురగల దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసి పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Crime News: పంజాగుట్ట చిన్నారి హత్య కేసు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Crime News: గొడవ అవుతుందని వెళితే.. పోలీస్ అధికారినే చితకబాదారు.. తాళ్లతో కట్టేసి దారుణంగా..