Ajaymishra Eggs Attack: కేంద్రమంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి.. అజయ్‌మిశ్రాకు చేదు అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో..
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. అవును, లఖీంపూర్ ఘటనే ఇందుకు కారణం. ఉత్తర ప్రదేశ్ టు ఒడిశా.. ఇలా అన్ని చోట్లా ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రి ఎక్కిడికి వెళ్లినా నిరసనలు హోరెత్తుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా ఒడిశా పర్యటనకు వెళ్లారు.
కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. అవును, లఖీంపూర్ ఘటనే ఇందుకు కారణం. ఉత్తర ప్రదేశ్ టు ఒడిశా.. ఇలా అన్ని చోట్లా ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రి ఎక్కిడికి వెళ్లినా నిరసనలు హోరెత్తుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా ఒడిశా పర్యటనకు వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెళ్తుండగా NSUI విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి పోలీసులు కంట్రోల్ చేసినా.. ఒక విద్యార్థి సెక్యూరిటీ జోన్‌ను దాటుకుని రోడ్డుపైకి వచ్చాడు. కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న కారుపై మూడు కోడి గుడ్లు విసిరాడు.
కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్‌లో ఆందోళన చేస్తున్న అన్నదాతలపైకి అజయ్‌మిశ్రా తనయుడు వేగంగా కారు పోనివ్వడంతో పలువురు రైతులు మృతి చెందారు. దీంతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆ ఘటనపై విచారణ కూడా కొనసాగుతోంది. మరోవైపు.. లఖీంపూర్ ఘటనకు అజయ్‌మిశ్రా నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ విద్యార్థి విభాగం NSUIకి చెందిన కొందరు.. ఒడిశా పర్యటనలో కేంద్రమంత్రికి నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి నిరసన తెలిపారు.
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…