Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: షో ముగిసే సమయంలో ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వార్తలేంటీ.? హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ నిజంగానే వస్తున్నారా?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌.. ఎక్కడో హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో భారత దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ విజయవంతమైందంటే దీనికి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో..

Bigg Boss 5 Telugu: షో ముగిసే సమయంలో ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వార్తలేంటీ.? హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ నిజంగానే వస్తున్నారా?
Biggboss 5 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 08, 2021 | 3:48 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌.. ఎక్కడో హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ రియాలిటీ షో భారత దేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ విజయవంతమైందంటే దీనికి ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఈ రియాలిటీ షో విజయవంతంగా నడుస్తోంది. ఇక తెలుగులో ఏ స్థాయిలో టీఆర్‌పీ దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటికీ నాలుగు 4 ఎడిషన్‌లు పూర్తి చేసుకొని తాజాగా ఐదో ఎడిషన్‌ కొనసాగుతోంది. షో మొదలై 11 వారాలు గడుస్తోంది. వారానిని ఒక్కో కంటెస్టెంట్‌ హౌజ్‌ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ షోలో అనవాయితీ వచ్చే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా వైరల్‌ అవుతోంది.

నిజానికి గతంలో జరిగిన ఎపిసోడ్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారు. కానీ తాజాగా జరుగుతోన్న షోలో మాత్రం 11 వారాలు గడుస్తోన్న ఇప్పటికీ ఆ ఊసే లేదు. ఇక షో ఇంకా కేవలం 6 వారాలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇలాంటి సమయంలో కొత్త కంటెస్టెంట్‌ రావడం వల్ల వచ్చిన వారికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆరు వారాలు హౌజ్‌లో ఉంటే బిగ్‌బాస్‌ విన్నర్‌గా గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఇక తాజాగా నెట్టింట్‌ వైరల్‌ అవుతోన్న సమాచారం ప్రకారం హౌజ్‌లోకి ఓ హీరోయిన్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా రానుందని తెలుస్తోంది. మరి కేవలం 6 వారాలు ఉన్న సమయంలో నిజంగానే హౌజ్‌లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందా.? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: AP Politics: టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉంటాం.. వారి తరఫున ప్రభుత్వంపై పోరాడతాం.. జనసేన అధినేత పవన్‌ భరోసా..

PM Kisan: దుర్వినియోగం అవుతున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌.. ఇక్కడ అనర్హులకే బెనిఫిట్‌.. అధికారులు విచారణ

Newly Wedding: వివాహ వేదికను నిరసన వేదికగా మార్చుకున్న నవ దంపతులు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు..!