Newly Wedding: వివాహ వేదికను నిరసన వేదికగా మార్చుకున్న నవ దంపతులు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు..!
Newly Married Couple: పెళ్లి వేదిక అంటే.. హంగులు, ఆర్భాటాలు, విందులు, చిందులతో బిజీ బిజీగా ఉంటుంది. పెళ్లి చేసుకునే నవదంపతులు ఫుల్ బిజీగా ఉంటారు.
Newly Married Couple: పెళ్లి వేదిక అంటే.. హంగులు, ఆర్భాటాలు, విందులు, చిందులతో బిజీ బిజీగా ఉంటుంది. పెళ్లి చేసుకునే నవదంపతులు ఫుల్ బిజీగా ఉంటారు. ఎటూ మెసలలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వేదికను ఓ జంట నిరసన వేదికగా మార్చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన ఆ జంట.. ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్న రీతిలో వెల్లడించారు. మహారాష్ట్రలోని థానేలో జరిగిన వివాహ వేడుకలో నవ దంపతులు పర్యావరణ పరిరక్షణకై సరికొత్త రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, విహార్ సరస్సు, పోవై సరస్సులను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC) సైకిల్ ట్రాక్ ప్రాజెక్టు నుంచి రక్షించడానికి తమ వంతు కృషి చేశారు. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న రెండు జంటలు.. ప్లకార్డులు పట్టుకుని ‘సేవ్ విహార్ లేక్’ అని ప్రదర్శించారు.
‘‘మా భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, దయచేసి మా పొవై సరస్సు, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌ని ఆక్రమించొద్దు.’’ అని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం పరిసరాల్లో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సదరు ఉద్యాన వనంలో కొంతభాగం చెట్లు తొలగించాల్సి వస్తుంది. దీన్ని పర్యావరణ ప్రేమికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇదొక విధ్వంసక ప్రాజెక్టు అంటూ ఫైర్ అవుతున్నారు. జీవావరణానికి ప్రమాదం కలిగించే చర్యలే తప్ప.. మరోటి కాదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. కాగా, ఎవరెంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. అధికారులు తమ పనిని తాము చేసుకుంటూ పోతున్నారు. నేషనల్ పార్క్ లోపల, విహార సరస్సు పరిసరాల్లో సైకిల్ ట్రాక్ పనులను కొనసాగిస్తున్నారు.
Also read:
ఈ గ్రామంలో అందరూ వందేళ్లకుపైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏమిటి..? గ్రామస్తులంతా దీర్ఘాయుష్కులే
Bandi Sanjay: నోరు తెరిస్తే అబద్దాలే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై విరుచుకుపడిన బండి..
Viral Video: ప్రభుదేవాను మించిపోయిన ఎలుగుబంటి.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..