Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: నోరు తెరిస్తే అబద్దాలే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై విరుచుకుపడిన బండి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతు.. తనదైన తరహాలో విరుచుకుపడ్డారు.

Bandi Sanjay: నోరు తెరిస్తే అబద్దాలే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై విరుచుకుపడిన బండి..
Band Vs Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 08, 2021 | 1:40 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతు.. తనదైన తరహాలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతారని అంటే.. పెట్రోల్, డీజిల్ ధర తగ్గింపుపై ప్రకటన ఉంటుందని ఆశించామని.. అయితే తాను విమర్శలు చేశారని అన్నారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి డిమాండ్ చేశారు. యువకులు ఉపాధి హామీ పని చేయడానికి గ్రామాలకు వస్తున్నారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం చెప్తోంది.. దీనిపై సర్వే జరగాలని కోరారు బండి సంజయ్. ధాన్యం కొనుగోలుపై కేంద్రం పెత్తనం ఏంటని గతంలో కేసీఆర్ అన్నారు. ఇప్పుడు.. ఏడేండ్ల నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందా? ధాన్యం కొనుగోలుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టామని అంటారు.  కేంద్రం ధాన్యం కొనట్లేదని మీరే అంటారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు.

60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటామని 31.08.2021 రోజున కేంద్రం లేఖ రాసింది. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానన్నారు.. ఎక్కడ చేశారని ఎద్దేవ చేశారు. రైతుచట్టాలపై ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా? కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని కొత్త చట్టంలో ఉందా? గతంలో ఎగుమతి చేయాలన్న కేసీఆర్ ఇప్పుడు వద్దంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 32-35 శాతం వ్యాట్ పెంచారు. లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణకు రూ.28 వస్తున్నాయని.. కేంద్రానికి వచ్చే రూ.27లోను రాష్ట్రానికి రూ.12 వస్తున్నాయని వివరణ ఇచ్చారు. వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండోదన్నారు బండి సంజయ్. 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 40 వేల కోట్లే వచ్చాయని అబద్దాలు చెప్తోందని బండి సంజయ్ దుయ్యబట్టారు.

జాతీయ రహదారుల కోసం రూ.40 వేల కోట్లు మంజూరు చేసింది కేంద్రం. ఇప్పటికే కేంద్రం రూ.21 వేల కోట్లు ఇచ్చింది. KRMB, GRMB ఏంటన్నప్పుడు.. మీటింగ్‌కు ఎందుకు హాజరయ్యారని అన్నారు. 575 టీఎంసీలు రావల్సి ఉండగా.. 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

బండి సంజయ్ లైవ్ ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి: Chennai Rains LIVE Updates: నీటమునిగిన చెన్నై మహానగరం.. పడవల్లా తేలియాడుతున్న కార్లు..