ఈ గ్రామంలో అందరూ వందేళ్లకుపైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏమిటి..? గ్రామస్తులంతా దీర్ఘాయుష్కులే

సాధారణంగా వందేళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70-80 ఏళ్లు బతకడమే గగనమైపోతుంది. అది కూడా ఆరోగ్యకరమైన..

ఈ గ్రామంలో అందరూ వందేళ్లకుపైగా బతుకుతారు.. వారి ఆరోగ్య రహాస్యం ఏమిటి..?  గ్రామస్తులంతా దీర్ఘాయుష్కులే
Follow us

|

Updated on: Nov 08, 2021 | 1:29 PM

సాధారణంగా వందేళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 70-80 ఏళ్లు బతకడమే గగనమైపోతుంది. అది కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు పాటిస్తే ఇన్నేళ్లు బతుకుతారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా ఎక్కువ కాలం బతకడం లేదు. కానీ ఓ గ్రామంలో మాత్రం అందరి వందేళ్లకుపైగానే బతుకుతున్నారు. ఆ గ్రామంలోని మహిళలు ప్రపంచంలోనే అత్యధిక ఆయుష్సుగలవారే ఉన్నారు. ఎక్కడో అనుకుంటున్నారా..? ఇంగ్లండ్‌లోని డెట్లింగ్‌-తుర్నాహామ్ గ్రామం. ఆ గ్రామంలో అందరూ దీర్ఘాయుష్కులే.

ఇక్కడ వందేండ్లు బతకడం అనేది చాలా కామన్‌. గ్రామం రెండు అంశాల్లో ప్రసిద్ది పొందింది. మొదటిది గ్రామస్తులంతా దీర్ఘాయుష్కులు కావడం, రెండోది పురుషులు కన్నా మహిళలు ఎక్కువ కాలం జీవించడం. ఈ గ్రామంలో మహిళలు సగటు ఆయుష్సు 95 ఏళ్లు. కాగా బ్రిటన్‌లోని ప్రజల సగటు ఆయుర్దాయం 83 ఏళ్లు.

డెట్లింగ్-తుర్నాహామ్ గ్రామస్తుల దీర్ఘాయుష్షుకు కారణమేంటి..? డెట్లింగ్‌-తుర్నాహామ్‌ గ్రామస్తుల దీర్ఘాయుష్సుకు కారణమేంటని అందరు ఆశ్చర్యపోతుంటారు. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఇంట్లో కానీ, బయటకాని పొగతాగడం నిషేధం. వీరి ఆరోగ్య రహస్యంలో ఇదే కీలకమంటున్నారు ఆ గ్రామస్తులు. గ్రామస్తుల దీర్ఘాయువుకు ఇంకో ప్రధానం కారణం ఏంటంటే అనుక్షణం అందుబాటులో ఉన్న వైద్య సేవలు. ఈ గ్రామం సహజ రిజర్వాయర్‌కు సమీపంలో ఉండటంతో అందుబాటులో శుద్ధమైన తాగునీరు లభిస్తుంది. గత ఏడేళ్ల నుంచి పొగ తాగడంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది ఈ గ్రామం. ఇంతకీ ఈ గ్రామంలో జనాభా ఎంతంటే కేవలం 800 మంది మాత్రమే. దేశంలో అత్యధిక వయస్సున్న ప్రజల జాబితాలో డెట్లింగ్ గ్రామాన్ని చేర్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఈ గ్రామస్తులను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. హెయిర్ డ్రెస్సర్ పనిచేస్తున్న ఐరీన్ నోబ్స్ తన 102 జన్మ దినోత్సవాన్ని ఈ ఏప్రిల్ నెలలో జరుపుకొన్నారు.

వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ► ప్రపంచ దేశాల ప్రజల సగటు ఆయుర్దాయం 72.74 (73) ఏళ్లు ► పురుషుల సగటు ఆయుర్దాయం 70.8(71) ఏళ్లు ► మహిళల సగటు ఆయుర్దాయం 75.6(76) ఏళ్లు

ప్రపంచంలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా ఉన్న దేశాలు: ► జపాన్ 84 ఏళ్లు. ► మకావ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతం చైనా 84 ఏళ్లు. ► చైనా 77 ఏళ్లు. ► స్విట్జర్లాండ్ 84 ఏళ్లు. ► భారత్‌లో సగటు అయుర్దాయం 69.66 (70) ఏళ్లు.

ఆయా దేశాల్లో 65 ఏళ్లు దాటిన వృద్ధులు: ► తమ జనాభాలో అత్యధిక వృద్ధులను కలిగివున్న టాప్ 5 దేశాలు 1. చైనా – 16.6 కోట్లు 2. భారత్ – 8.5 కోట్లు 3. అమెరికా – 5.3 కోట్లు 4. జపాన్ – 3.6 కోట్లు 5. రష్యా – 2.1 కోట్లు

► ఆయా దేశాల్లో జనాభాతో పోలిస్తే అత్యధికంగా వృద్ధులను కలిగివున్న దేశం జపాన్. ► జపాన్ తన దేశ జనాభాతో పోలిస్తే అత్యధికంగా 28.2 శాతం వృద్ధులను కలిగి ఉంది. ► 22.8 శాతం వృద్ధులతో రెండో స్థానంలో ఇటలీ ఉంది. ► 22.1 శాతం వృద్ధులతో మూడో స్థానంలో జర్మనీ, పోర్చుగల్, గ్రీస్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Skirts for Boys: ఇకపై అబ్బాయిలూ స్కర్ట్స్ ధరించొచ్చు.. ఆర్డర్స్ ఇష్యూ చేసిన మేయర్.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!

Birds Hospital: అక్కడ పక్షులకూ ఓ స్పెషల్ హాస్పిటల్.. ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.