Viral News: 88 ఏళ్లు అయినా అలాగే ఉంది.. పురావస్తు తవ్వకాల్లో బయట పడ్డ అద్భుతం..
Viral News: సాధారణంగా పురవాస్తు శాఖ వారు చేసే తవ్వకాల్లో కలప, ఉక్కుతో చేసే వస్తువులు బయటపడతాయి. ఎన్నేళ్లు అయినా ఇవి చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక జంతువుల, మనుషుల అవశేషాలు బయటపడతాయి...
Viral News: సాధారణంగా పురవాస్తు శాఖ వారు చేసే తవ్వకాల్లో కలప, ఉక్కుతో చేసే వస్తువులు బయటపడతాయి. ఎన్నేళ్లు అయినా ఇవి చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక జంతువుల, మనుషుల అవశేషాలు బయటపడతాయి. వీటితో పాటు నాణేలు, ఆభరణలు లాంటివి వెలుగులోకి వస్తుంటాయి. వీటి ఆధారంగా గతించిన చరిత్ర తాలూకు వివరాలు భవిష్యత్తు తరాలకు తెలుస్తాయి. అయితే ఆహార పదార్థాలు బయటపడితే ఎలా ఉంటుంది.? అది కూడా ఓ 88 క్రితం నాటి ఆహార పదార్థమైతే.. ఏంటి వినడానికే ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ.! ఆహార పదార్థాలు 88 ఏళ్ల పాటు పాడవకుండా ఉండడం ఏంటని.. ప్రశ్నిస్తారా.? అయితే ఈ అద్భుతం నిజంగానే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లో సుమారు 88 ఏళ్ల క్రితం ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ సమయంలోనే ఇంట్లో ఉన్న వారంతా మరణించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇన్నేళ్ల తర్వాత ఆ ఇంటిలో పురవాస్తు శాఖ వారు తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లో ఓ కేకు బయటపడింది. అయితే ఆ కేకు ఇప్పటికీ తాజాగా ఉండడం విశేషం. కేకుతో పాటు దానిపై డెకరేట్ చేసిన చాక్లెట్ చిప్స్, ఓ కత్తి, నాలుగు స్పూన్లు అలాగే ఉన్నాయి. ఈ విషయం కాస్త వెలుగులోకి రాడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
88 ఏళ్ల క్రితం నాటి కేకు ఇంకా తాజాగా ఎలా ఉందన్న కోణంలో పరిశోధకులు ఆరా తీసుకున్నారు. కేకు తాజాగా ఉండడానికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఆ ఇల్లు జోహాన్ వార్మ్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇంగ్లండ్‌లో చాలా ఏళ్ల క్రితం రెండో ప్రపం యుద్ధ సమయంలో వందలాది ఇళ్లు మంటల్లో దగ్ధమైపోయాయని, అందులో ఈ ఇల్లు కూడా ఒకటై ఉండొచ్చని పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: Sania Mirza Cheering: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..
Viral Video: ప్రభుదేవాను మించిపోయిన ఎలుగుబంటి.. వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..