Dangerous railway tracks video: ప్రపంచంలోనే డేంజరస్ రైల్వే ట్రాక్‌లు..చూస్తే గుండె జారుతుంది..! (వీడియో)
మనం ఎన్నో రైల్వే ట్రాక్‌లను చూసి ఉంటాం. ప్రపచంలోనే అత్యంత డేంజరస్ రైల్వేట్రాక్‌లు ఎప్పుడైనా చూసారా.. వీటిని చూస్తే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి భయంకరమైన రైల్వే ట్రాక్‌లు ఎక్కడున్నాయో చూద్దామా...
ప్రపంచంలోనే డేంజరస్ రైల్వేట్రాక్‌లో ఒకటి అర్జెంటీనాలో ఉన్న సాల్టా పోల్వెరిల్లో ట్రాక్, దీని నిర్మాణానికి 27 ఏళ్లు పట్టిందట. ఈ ట్రాక్ సామాన్య ప్రజలకోసం 1948లో ప్రారంభించారట. ఈ ట్రాక్ 4,200 ఎత్తులో ఉంటుంది. ఏదైనా రైలు ఈ ట్రాక్ మీదుగా వెళ్ళినప్పుడు 29 వంతెనలు దాటి, 21 సొరంగాల గుండా వెళుతుందట. ఇక రెండవది జపాన్‌లో ఉండే అసో మయామి రూట్. ఇది జపాన్‌లోని అత్యంత ఛాలెంజింగ్ రైల్వే ట్రాక్. 2016 లో కుమామోటోలో భూకంపం వచ్చినప్పుడు ఈ ట్రాక్ కొంత భాగం దెబ్బతినడంతో… అప్పటి నుంచి దీనిని చాలా అరుదుగా ఉపయోగిస్తున్నారు.
అత్యంత ప్రమాదకరమైన మూడో రైల్వే ట్రాక్ చెన్నై-రామేశ్వరం మార్గం. ఇది ప్రమాదకరమే కాదు, సాహసోపేతమైన రైల్వే ట్రాక్. దీని ట్రాక్‌ను పవన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దీనిని 1914లో హిందూ మహాసముద్రంపై నిర్మంచారు. ఇది 2.3 కి.మీ. ఉంటుంది. ఇక నాలుగో డేంజరస్ రైల్వే ట్రాక్ కేప్ టౌన్ దక్షిణాఫ్రికాలో ఉంది. ఈ ట్రాక్ దొంగతనాలు, దాడులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అందుకే తరచూ ఇటు వెళ్లే రైళ్లను రద్దు చేస్తూ ఉంటారు. మన 5వ డేంజరస్ రైల్వే ట్రాక్ డెవిల్స్ నోస్. ఈక్వెడార్‌లో ఉంది. ఈ రైల్వే ట్రాక్ సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ ట్రాక్ నిర్మాణం 1872 లో ప్రారంభించి 1905 నాటికి పూర్తి చేశారు. ఈ ట్రాక్ నిర్మాణ సమయంలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి దీనిని డెవిల్స్ నోస్ ట్రాక్ అని పిలుస్తున్నారు..
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..