Daughter at Father Body: ఇలాంటివాళ్లుకూడా ఉంటారా.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని మరీ ఇలా చేస్తారా..? వైరల్ వీడియో..

Daughter at Father Body: ఇలాంటివాళ్లుకూడా ఉంటారా.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని మరీ ఇలా చేస్తారా..? వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 08, 2021 | 9:01 AM

సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొందరు తమ ఫోటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేయడం అందులో కొన్ని వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేయడం షరా మామూలే. ఈ క్రమంలో

సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కొందరు తమ ఫోటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేయడం అందులో కొన్ని వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేయడం షరా మామూలే. ఈ క్రమంలో కొంతమంది తమ పైత్యాన్ని సోషల్‌మీడియాలో కూడా చూపెడుతూ నెటిజ‌న్ల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.
అమెరికాకు చెందిన ఓ అమ్మాయి తండ్రి కొద్దిరోజుల క్రితం మరణించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతలో ఆ యువతి తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా ఓ ఫొటోలో తన బాధను పక్కన పెట్టి చిరునవ్వు కూడా చిందించింది. తరువాత వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. తండ్రి మరణిస్తే శవం పక్కన అలా ఫొటోలకు ఫోజులు ఏంటని మండిపడుతున్నారు. దీంతో వెంట‌నే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది ఆ యువతి. కానీ.. త‌ను ఆ పోస్ట్‌ను డిలీట్ చేయ‌డానికి ముందే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజ‌న్లు వాటిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…