Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bholaa Shankar: భోళా శంకర్ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. మెగాస్టార్ న్యూలుక్ చుశారా ?..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తూ

Bholaa Shankar: భోళా శంకర్ సినిమా అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్.. మెగాస్టార్ న్యూలుక్ చుశారా ?..
Bholaa Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 09, 2021 | 7:53 AM

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తూ.. బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే చిరు నటించిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోపాటు.. చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు భోళా శంకర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‏ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‏ను ఈనెల 11న ఘనంగా ప్రారంభించబోతున్నారు.

తమిళంలో అజిత్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా వేదాళంను తెలుగు రీమేక్ భోళా శంకర్‏గా తెరకెక్కిస్తున్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తుంది. చిరు బర్త్ డే సందర్భంగా.. భోళా శంకర్ టైటిల్ పోస్టర్, కీర్తి సురేష్.. చిరంజీవి బంధాన్ని తెలియజేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ క్రమంలోనే భోళా శంకర్ లుక్ టెస్ట్.. ఫోటో షూట్ స్టార్ట్ చేశామని.. ఈనెల 11న ఉదయం7.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నామని.. ఆ తర్వాత 15న షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లుగా ప్రకటించాడు డైరెక్టర్ మెహర్ రమేష్. ఇక తాజాగా విడుదలైన ఫోటోలలో చిరు డిఫరెంట్ లుక్‏లో కనిపిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Liger Movie: చివరి దశలో లైగర్.. లాస్ట్ షెడ్యూల్‏ను అక్కడ ప్లాన్ చేసిన మాస్ డైరెక్టర్..

Oka Chinna Family Story: నాగార్జున చేతుల మీదుగా విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ట్రైలర్..

Pradeep Machiraju: మహాభారత యుద్ధంలో కౌరవ..పాండవ సేనకు భోజనం పెట్టింది ఎవరు? ఆహా..అనిపించిన ప్రదీప్!