Oka Chinna Family Story: నాగార్జున చేతుల మీదుగా విడుదలైన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ట్రైలర్..

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... అంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు.

Oka Chinna Family Story: నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 09, 2021 | 7:09 AM

Oka Chinna Family Story: వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు అంటూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీలు. ఈ క్రమంలోనే జీ 5 కూడా ప్రజల అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్ ను ఎంచుకొని అలరిస్తోంది.  గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. అలాగే ఈ ఏడాది ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను విడుదల చేసింది. తాజాగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా… సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS). మెగా డాటర్ నిహారికా కొణిదెల ఈ సిరీస్ ను నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల చేసిన నాగార్జున గారు మాట్లాడుతూ “మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ. సినిమా ఫ్యామిలీ. కానీ, ఈ మహేష్ ది చిన్న ఫ్యామిలీ అంట. మరి, ఈ చిన్న ఫ్యామిలీ స్టోరీ ఏంటో చూద్దాం రండి. మామూలుగా లేదుగా ట్విస్ట్. మరి, ఈ బరువు బాధ్యత మహేష్ తీసుకుంటాడంటారా? చూద్దాం… నవంబర్ 19న ‘జీ 5’లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని ఎక్స్‌క్లూజివ్‌గా. నిహారిక, మహేష్ ఉప్పాల, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ట్రైలర్ చూశాక ఈ ఫ్యామిలీ స్టోరీ చూడాలని నేను కూడా వెయిటింగ్” అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే

Eesha Rebba: వొంపు సొంపులతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న ఈషా రెబ్బ

Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?