Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..
బిగ్‌బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం కండల వీరుడు విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
బిగ్‌బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ వారం కండల వీరుడు విశ్వ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే షో ముందు నుంచి విశ్వ.. ఇతర కంటెస్టెంట్స్‌కు గట్టి పోటీనిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తక్కువ సమయంలోనే విశ్వ బయటకు కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. విశ్వ ఎలిమినేట్ కావడంతో.. యానీ మాస్టర్ బోరున ఏడ్చేసింది. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత.. అరియానా గ్లోరితో బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు విశ్వ. ఈ క్రమంలో ప్రియాంక, మానస్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు విశ్వ.
ప్రియాంక.. మానస్ రిలేషన్ గురించి అరియనా ప్రశ్నించగా.. ప్రియాంక మానస్‌ను నిజంగానే ప్రేమిస్తుందని.. తనకు చిన్న దెబ్బ తగిలినా ప్రియాంక అక్కడ ఉంటుందని.. కానీ మానస్ అలా ఆలోచించడం లేదంటూ చెప్పాడు విశ్వ. అయితే ఒకసారి ప్రియాంక కిందపడిపోయినప్పుడు మానస్ పట్టించుకోలేదని.. ఎందుకు అలా అని అడిగితే గేమ్‌లో అయితే పట్టించుకుంటాను.. ఎదో మజాక్ లో పడిపోతే నాకు తెలియదని సమాధానమిచ్చాడట మానస్. ఇక సిరి, షన్నూ గురించి ప్రశ్నించింది అరియానా.. అయితే వారిద్దరూ బయట ఫ్రెండ్స్ అయినా.. ఇక్కడి వచ్చిన తర్వాత ఒకరి జీవితంతో ఆడుకోవద్దని.. అని తాను చెప్పాలనుకుంటున్నానంటూ అసలు విషయం బయటపెట్టాడు విశ్వ. ఇక ఆ తర్వాత.. ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను బయటపెట్టాడు విశ్వ.
Pooja Hegde: లక్కీ ఛాన్స్ అందుకున్న పూజా హెగ్డే ?.. భవదీయుడు సరసన బుట్టబొమ్మ..
Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. హైకోర్టు సెట్ ఎన్ని రోజుల్లో వేశారంటే..