Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లెటేస్ట్ అప్డేట్..  చివరిలో దశలో షూటింగ్.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే.. 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట లెటేస్ట్ అప్డేట్..  చివరిలో దశలో షూటింగ్.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే.. 
Sarkaru Vaari Paata
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2021 | 7:34 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న లెటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇటీవల స్పెయిన్‏లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు.. ఓ పాటను చిత్రీకరించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా చివరి షెడ్యూల్‏ను తాజాగా హైదరాబాద్‏లో స్టార్ట్ చేసింది సర్కారు వారి పాట టీం. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలతోపాటు.. ఓ పాటను.. ప్యాచ్ వర్క్ అంతా షూట్ చేయనున్నారట. ఇక హైదరాబాద్ షూటింగ్‏ పూర్తైతే.. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లే అని తెలుస్తోంది. ఇక అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ఆలోచనలు ఉన్నారట డైరెక్టర్.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల మీద నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 1కి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇందులో మహేష్ స్టైలీష్ లుక్‏లో కనిపించబోతున్నారు.

Also Read: Suriya Jai Bhim: ఆకట్టుకుంటున్న జైభీమ్ మేకింగ్ వీడియో.. హైకోర్టు సెట్ ఎన్ని రోజుల్లో వేశారంటే..

Natraj Master: పాపం పండింది.. ఊసరవెల్లి బయటకు వచ్చింది.. నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్…

Prabhas: పప్పులో కాలేసిన లక్ష్మణుడు.. తెలుసుకోవాలి కదా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

Bigg Boss 5 Telugu: షో ముగిసే సమయంలో ఈ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వార్తలేంటీ.? హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్‌ నిజంగానే వస్తున్నారా?