AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tip Tip Barsa Pani: ఆ రాగం ఏది.. ఆ శృతి ఏది.. కత్రినా హాట్ సాంగ్‌పై నెటిజన్ల ఫైర్..

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'సూర్యవంశీ' చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సూర్యవంశీతో పాటు ఈ చిత్రంలోని 'టిప్-టిప్ బర్సా పానీ' పాట కూడా సోషల్ మీడియా చర్చలో ఉంది.

Tip Tip Barsa Pani: ఆ రాగం ఏది.. ఆ శృతి ఏది.. కత్రినా హాట్ సాంగ్‌పై నెటిజన్ల ఫైర్..
Tip Tip Barsa Pani
Sanjay Kasula
|

Updated on: Nov 09, 2021 | 9:45 AM

Share

Raveena Vs Katrina: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘సూర్యవంశీ’ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సూర్యవంశీతో పాటు ఈ చిత్రంలోని ‘టిప్-టిప్ బర్సా పానీ’ పాట కూడా సోషల్ మీడియా చర్చలో ఉంది. ఈ పాటలో కత్రినా స్టైల్ అందరినీ మరోసారి హర్ట్ చేసేలా ఉంది. అయితే, ‘టిప్ టిప్ బర్సా పానీ’ 1994 చిత్రం ‘మొహ్రా’లో కనిపించింది. ఇందులో రవినా టాండన్, అక్షయ్ కుమార్‌ల కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఆ పాటకు.. ఆ సినిమాకు ఫ్యాన్స్ అంతా ఇంతా కాదు.. ఉత్త‌రాది, ద‌క్షిణాది తేడాల్లేకుండా సూప‌ర్ హిట్ అయిన పాట‌ ఇదే. అంతలా అభిమానులను దక్కించుకుంది. భారత దేశంలోని చాలా మంది సినిమా ప్రేమికులు ఈ పాటను.. అందులోని వారిని కెమిస్ట్రీని ఎప్పటికీ మరచిపోలేకపోతున్నారు.

ఆడియో క్యాసెట్ల హవా నడుస్తున్న సమయంలో ప్రతి ఇంట్లో ఈ పాట వినిపించేది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆకాశ‌వాణీ వివిధ భార‌తి ప్రోగ్రామ్‌లో ఎక్కువ సార్లు వినిపించిన పాట కూడా ఇదే.. అయితే అక్కడి నుంచి నెట్టింట్లోకి యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా ఈ సాంగ్ మోగుతూనే ఉంది. ఈ పాట ఏ సినిమాలోది.. ఆ సినిమాను ఎంత మంది చూశార‌నేది ప‌క్క‌న పెడితే.. ఈ పాట మాత్రం ఆల్ టైమ్ సూప‌ర్ హిట్స్‌లో ఒక‌టిగా చేరిపోయింది.

అయితే.. ఇప్పుడు ఈ ఎవర్‌గ్రీన్  హిట్ సాంగ్‌ను రీమేక్ చేశారు. రవీనా తర్వాత.. కత్రినా తన హాట్‌నెస్‌తో ప్రజల హృదయాల్లో ముద్ర వేసింది. కాబట్టి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇద్దరినీ పోల్చడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధం నడుస్తోంది. ఈ పాట గురించి యూజర్లు తమ తమ అభిప్రయాలను పంచుకుంటున్నారు. రవినా టాండన్ చేసిన మ్యాజిక్‌ను.. కత్రినా విఫలమైందంటూ నెటిజన్లు హీట్ పెంచుతున్నారు.

ఆ హాట్ బ్యూటిఫుల్ రెయిన్ సాంగ్స్‌లో “టిప్ టిప్ బ‌ర్సా పానీ” అగ్రస్థానంలో ఉంది. మ‌రి అద్భుతమైన పాటను రీమిక్స్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రీమిక్స్ చేసే సాహ‌సం సూర్య‌వంశీ యూనిట్‌ ఎలా చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట విలువ మీకు తెలుసా? అంటూ.. క్లాస్ పీకాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అంటూ క్లాస్ పీకుతున్నారు. ఆ టెంపో ఏదీ? ఆ బీట్ ఏదీ? మీరు ఎంచుకున్న శ్రుతేమిటి? ఆ పాట శ్రుతేమిటి? మేము ఏదో ఊహించుకుంటాం.. మీరు మాత్రం అక్క‌డ‌కు రారు! అని కత్రినాకైఫ్‌కే కాదు.. అక్ష‌య్ కుమార్‌కు కూడా క్లాస్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?