Jai Bhim – Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..

Jai Bhim Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ.. సరికొత్త పాత్రలను ఎంచుకుని నటిస్తూ అభిమానులచే సింగం గా, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన హీరో సూర్య తాజాగా నటించిన..

Jai Bhim - Raghava Lawrence: మరోసారి దాతృత్వం చాటుకున్న లారెన్స్.. జై భీమ్ రియల్ ‘సినతల్లి’కి భారీ సాయం..
Jai Bheem Raghava Lawrenc
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 09, 2021 | 8:23 AM

Jai Bhim Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ.. సరికొత్త పాత్రలను ఎంచుకుని నటిస్తూ అభిమానులచే సింగం గా, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం ‘జై భీమ్’. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యుత్తమ సినిమాగా ప్రేక్షక లోకం నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కులతత్వం, పోలీసుల క్రూరత్వం, సమాజంలో మానవ హక్కులు ఏ విధంగా హరించివేయబడుతున్నాయనే అంశం నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా శతాబ్ధాలుగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలైన గిరిజనులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, వారు ఏ విధంగా అణచివేయపడుతున్నారనే దానిపై సినిమా చిత్రీకరించిన విధానం అందరి మన్ననలు అందుకుంటోంది.

‘జై భీమ్’ సినిమాలో గిరిజన గర్భిణీ మహిళ భర్త రాజకన్నును పోలీసులు తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయడమే కాకుండా లాకప్‌లో కొట్టి చంపేస్తారు. దాంతో తనకు న్యాయం కోసం పోరాడుతుంది ఆ మహిళ. నిజ జీవితంలో తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాసకన్న విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. నిజ జీవితంలో జరిగిన అంశాలనే సినిమా కథగా ఎంపిక చేసుకున్న సినీ దర్శకుడు జ్ఞానవేల్.. ‘జై భీమ్’ పేరుతో సినిమాను తెరకెక్కింది. ఇ సినిమాలో ప్రధాన పాత్ర అయిన లాయర్ చంద్రు పాత్రలో హీరో సూర్య నటించగా.. బాధితుల పాత్రను ఇతర నటీనటులు పోషించారు.

ఇదిలాఉంటే.. తన ఉదార హృదయుడిగా, ఆపద్భాందవుడిగా పేరుగాంచిన నటుడు, దర్శకుడు, డ్యాన్సర్ రాఘవ లారెన్స్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా ‘జై భీమ్’ సినిమాను చూసిన ఆయన.. నిజ జీవితంలో చేయని నేరానికి పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై హత్య గావించబడిన రాజకన్ను భార్య పార్వతి పరిస్థితిని తెలుసుకుని తీవ్ర వేదనకు గురయ్యారు రాఘవ లారెన్స్‌. ప్రస్తుతం ఆమె పూరి గుడిసెలో జీవిస్తున్నట్లు తెలుసుకుని చలించిపోయారు. పార్వతికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. పార్వతి అమ్మాళ్‌కి తన స్వంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తానని వాగ్దానం చేశారు. ఆయకు ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. లారెన్స్ ప్రకటనతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన దాతృత్వానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, కరోనా సంక్షోభ సమయంలోనూ ఫ్రంట్ లైన్ కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు లారెన్స్ ఎంతగానో సాయం చేశారు. ఏకంగా రూ. 5 కోట్లకు పైగా విరాళం అందజేశారు.

కాగా, ఈ సినిమాను తెరక్కెక్కించిన దర్శకుడు జ్ఞానవేల్, నిర్మాతలు సూర్య – జ్యోతిక, చిత్ర యూనిట్‌ను అభినందించారు రాఘవ లారెన్స్. అలాగే, ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి.. నేటి సమాజంలో అణగారిన వర్గాల ప్రజలపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Also read:

ZyCoV-D Vaccine: సూది నొప్పి లేకుండా మన దేశ టీకా.. మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ జైకొవ్-డి ధర నిర్ణయించిన ప్రభుత్వం..ఎంతంటే..

Chanakya Niti: ఈ ఏడు అంశాలకు దూరంగా ఉండండి.. లేకుంటే అవి మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి..

Ravi Shastri: పెట్రోల్ పోసి వాహనాలను నడపొచ్చు.. మనుషులను కాదు: బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు