Chanakya Niti: ఈ ఏడు అంశాలకు దూరంగా ఉండండి.. లేకుంటే అవి మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి..

చాణక్య నీతిలో ఎవరితో స్నేహం చేయాలి.. ఎలాంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండాలి.. ఎవరి విశ్వసించాలి.. ఇలా మరో  7 అతి ముఖ్యమైన..

Chanakya Niti: ఈ ఏడు అంశాలకు దూరంగా ఉండండి.. లేకుంటే అవి మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి..
Chanakya
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 09, 2021 | 7:40 AM

ఆచార్య చాణక్యుడి దూరదృష్టి నేటి కాలంలో సరైనదని చాలా రుజువవుతోంది. ఆచార్య చాణక్యుడు తన ఆలోచనలను చాణక్య నీతి పుస్తకంలో పొందుపరిచాడు. ఈ పుస్తకంలో గృహస్థ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పారు. చాణక్య నీతిలో ఈ 7 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. చాణక్య నీతిలో ఎవరితో స్నేహం చేయాలి.. ఎలాంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండాలి.. ఎవరి విశ్వసించాలి.. ఇలా మరో  7 అతి ముఖ్యమైన విషయాలను చెప్పారు. అందులో డబ్బు, విలాసాలు, స్త్రీలు, రాజులు, సమయం, బిచ్చగాళ్ళు, దుర్మార్గులు అని ఆ ఏడు అంశాలు కీలకమైనవని వెల్లడించారు. చాణక్యుడు రాసిన చాణక్య నీతిలో చెప్పినట్లుగా స్త్రీలు, రాజులు, న్యాయవాదులు,  దుర్మార్గుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వారితో చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరించాలని అన్నారు. లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని సూచించారు.

చాణక్య నీతి 16వ అధ్యాయంలోని నాల్గవ శ్లోకంలో ఈ 7  అంశాలను ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ఆ శ్లోకం ఏమిటంటే…

కోర్తాణ్డప్రాప్య న గర్వితో వైషీణః కశ్యపదోస్తం గతాః స్త్రీభిః కస్య న ఖణ్డితం భువి మనః కో నాం రాజప్రియః । క: కాలస్య న గోచరత్వమమత్ కోర్తి గతో గౌరవం కో వా దుర్జన్దుర్గమేషు పతిః క్షేమేం యత్ పథి.

డబ్బు

ఈ పద్యంలో ధనాన్ని పొందడం వల్ల మనిషిలో గర్వం పుడుతుందని చెప్పబడింది. డబ్బు సంపాదించిన తర్వాత బుద్ధి  మారని వ్యక్తి అంటూ ఈ భూమ్మీద లేడని.. రాబోయే తరాల్లో కూడా ఉండరని చాణక్యుడు తెలిపారు.

లగ్జరీ

ఒక వ్యక్తి ఆనందం, విలాస చక్రంలో చాలా చిక్కుకుపోతాడు. ఎవరైతే దానిలో పడిపోతారో.. తమపై తమకు నియంత్రణ లేకుండా ఉంటే.. అతను ఎల్లప్పుడూ మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటాడు.

స్త్రీ

స్త్రీల వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో దుఃఖాన్ని, ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అది ప్రేమ వల్ల లేదా మరేదైనా కారణం కావచ్చు.

రాజు

న్యాయంగా ఉండే మంచి తెలివైన రాజు ఏ వ్యక్తిపైనా తన అనుగ్రహాన్ని కలిగి ఉండడు. అలాంటి రాజు ప్రతి ఒక్కరికీ తన మనస్సులో ఒకే భావాన్ని కలిగి ఉంటాడు. తప్పు చేసినందుకు తన ప్రియమైన వారిని కూడా శిక్షించకుండా వెనుకాడడు.

మరణం

చాణక్యుడు ప్రతి మనిషికి మరణం నిశ్చయమనే జీవిత సత్యాన్ని వెల్లడించారు. అందుకే కాలం దృష్ట్యా ఇప్పటి వరకు ఎవరూ బతకలేరని తెలిపారు.

డబ్బు అడిగే అలవాటు

డబ్బు అడిగే అలవాటు వల్ల గౌరవం దక్కదు. వస్తువులు లేదా డబ్బు అడిగే అలవాటు ఉన్న వారికి సమాజంలో ఎప్పుడూ గౌరవం లభించదు.

చెడు అలవాట్లు

చెడు అలవాట్లు ఉన్నవారు ఎప్పటికీ మారరు. ఒకప్పుడు చెడ్డవారి సాంగత్యంలో పడి తప్పుచేసిన వారు మళ్లీ మంచి మనుషులుగా మారలేరు. ఎవరైనా మారినప్పటికీ.. జీవితంలో మళ్ళీ ఏదో ఒక తప్పు చేస్తారు.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..