AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆలోచించి అడుగులు వేయాలి..!

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆలోచించి అడుగులు వేయాలి..!
Subhash Goud
|

Updated on: Nov 09, 2021 | 7:24 AM

Share

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్‌ 9)న మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ముఖ్యమైన విషయాలలో ఆలోచించి అడుగులు వేయడం మంచిది. వ్యాపారాలలో జాగ్రత్తలు తప్పనిసరి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

వృషభ రాశి: చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ విషయం మిమ్మల్ని ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో చేపట్టిన పనులలో మంచి ఫలితాలు లభిస్తాయి.

మిథున రాశి: అవసరానికి తగిన సహాయం అందుకుంటారు. బంధుమిత్రుల సూచనలు, సలహాలు పాటించడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: మీమీ రంగాలలో మంచి లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.

సింహ రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కన్య రాశి: చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

తుల రాశి: ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మానసిక ఆందోళన కలుగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

వృశ్చిక రాశి: కొన్ని కొన్ని సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శతృవులపై విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుటుంది.

మకర రాశి: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. మీపై నిందలు వేసే అవకాశం ఉంది.

కుంభ రాశి: చేపట్టే పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు,మిత్రుల సూచనలు, సలహాలు పాటించాలి.

మీన రాశి: ఓ వ్యవహారంలో సమయానికి డబ్బులు చేతికి అందుతారు. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి:

Shiva Pooja: కార్తీక మాసంలో శివుడిని ఇలా పూజిస్తే జన్మ ధన్యం.. తప్పక తెలుసుకోండి..

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌లో అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏమిటి..? ఒక్కో మెట్టుకు ఒక్కో విశిష్టత..!

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!