AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌లో అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏమిటి..? ఒక్కో మెట్టుకు ఒక్కో విశిష్టత..!

Sabarimala: కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని..

Sabarimala: శ‌బ‌రిమ‌ల‌లో అయ్యప్పస్వామి 18 మెట్ల ప్రాముఖ్యత‌ ఏమిటి..? ఒక్కో మెట్టుకు ఒక్కో విశిష్టత..!
Sabarimala Temple
Subhash Goud
|

Updated on: Nov 08, 2021 | 6:59 AM

Share

Sabarimala: కార్తీకమాసం మొదలుకాగానే గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. ఎంతో కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. శరణం.. శరణం అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో చేసే దీక్ష అయ్యప్ప దీక్ష. అనేక నియమ నిబంధనలతో కేరళలోని శబరిమలైకి 18 కొండలు, 18 మేట్లపై అధిష్టించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారి దీక్ష కార్తీక మాసంలో ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం వ‌చ్చిందంటే ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆల‌యాల్లో దీక్ష స్వాముల‌తో మారుమోగుతుంటాయి. ఈ మాసంలో 41 రోజుల పాటు అయ్యప్పమాలాధార‌ణ‌తో ప్రత్యేక పూజ‌లు చేస్తుంటారు. అలాగే ప్రపంచ సుప్రసిద్ధ ఆలయాల్లో శబరిమల ఒకటి.

41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తులు ఎన్నో వ్యయప్రయాసలతో.. ఇరుముడితో ధ‌రించి 18 కొండలు దాటుకుంటూ స్వామివారి సన్నిధానానికి చేరుకుని శ‌బ‌రిగిరుషున్ని ద‌ర్శించుకుంటారు. అక్కడ 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను ‘పదునెట్టాంపడి’ అని పిలుస్తారు. 41 రోజుల పాటు నియ‌మ నిష్టల‌తో క‌ఠోర దీక్ష చేప‌ట్టిన ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. సన్నిధానంలోని 18 మెట్లకు నమస్కరిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అలా ఎక్కిన వారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు ఆలయంలో స్వామివారు కొలువుదీరిన సందర్భంగా 18 వాయిద్యాలు మోగించారని చెబుతుంటారు.

ఒక్కో మెట్టు.. ఒక్కో విశిష్టత:

స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రతి అయ్యప్ప భక్తుడు 18 మెట్లను ఎక్కాల్సిందే. వీటిని గ్రానైట్‌తో నిర్మించారు. వాటికి పంచలోహాలతో పూత పూశారు. తొలుత కుడి కాలు పెట్టి స్వామివారి 18 మెట్లను భక్తులు ఎక్కాల్సి ఉంటుంది.

► స్వామివారి సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలకు సంబంధించినవి. కళ్లు, చెవులు, ముక్కు, జిహ్వ, స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి.

► తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామ, క్రోదం, మోహం, మద, మాత్సర్యం, అసూయ, డాంబికాలు పలకడం వంటి ఒక్కో దాన్ని ఒక్కో మెట్టు సూచిస్తుంది.

► తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి.

► ఇక చివరి రెండు మెట్లు విద్య, అవిద్య.. అంటే అజ్ఞానంను సూచిస్తాయి. ఎవరైతే ఈ 18 మెట్లను భక్తిభావంతో, గౌరవంతో ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారో వారు శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడవుతాడని భక్తుల ప్రగాఢ న‌మ్మకం. భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ దిగివస్తారు.

18 మెట్లకు సంబంధించి ప్రాచుర్యంలో మ‌రో క‌థ :

ఈ 18 మెట్లకు సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా పేర్కొంటారు. స్వామివారు సన్నిధానంలో విగ్రహ రూపం దాల్చకముందు వాటిని ఒక్కో మెట్టు వద్ద ఉంచారని చెబుతుంటారు. స్వామివారి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని, రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.. అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుందని చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Ayyappa Deeksha: అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి..? ప్రారంభమైన మాలాధరణలు.. దీక్ష నియమ నిబంధనలు..!

Karthika Masam: రాజమండ్రి పుష్కర ఘాట్‌కు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న దేవాలయాలు..

Follow Us