Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలు

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ..

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2021 | 12:32 PM

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా స్కీమ్‌లను రూపొందించింది పోస్టల్‌ శాఖ. ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాల స్కీమ్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్టు చేసే సదుపాయం ఉంది. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి.

స్కీమ్‌ గడువు ఐదేళ్లు:

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతూనే వస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే ఒకవేళ వడ్డీ రేటు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చు. లేదంటే అలానే స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరితే నెలకు 10 వేల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఐదు సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. ఖచ్చితమైన లాభం వస్తుంది తప్ప.. రిస్క్‌ అనేది ఉండదు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తిగానీ, ముగ్గురు కలిపి కూడా ఉమ్మడి ఖాతాగా తీసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే మైనర్ల పేరు మీద కూడా ఖాతా ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టువచ్చు. కనీసం 10 సంవత్సరాలపైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఉదాహారణకు చెప్పాలంటే.. మీరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్లయితే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ తర్వాత ఖాతా తీసినట్లయితే ప్రతి నెల చివరి దినం వరకు మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. గడువులోగా మొత్తాన్ని జమ చేయనట్లయితే కొంత పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే కొంత మినహాయింపు కూడా ఉంటుంది. మీరు ఆరు నెలల పాటు అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే నెలవారీ ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఎవరైనా ప్రతి నెల డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల పాటు అతను రూ.6000కు బదులు రూ.5900 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం మొత్తం డిపాజిట్‌ చేస్తే ఈతనికి నెలవారీ ప్రీమియంలో 40 శాతం వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి మొత్తం డిపాజిట్‌ రూ.12,000కు బదులు రూ.11,600 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మొత్తం రుణ సదుపాయం:

ఇక రుణ సదుపాయం విషయానికొస్తే.. డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం రుణం పొందే అవకాశం ఉంటుంది. ఏడాది తర్వాత డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందవచ్చు. దానిని వివిధ వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించి సౌకర్యం ఉంటుంది. రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతం వీడిగా ఉంటుంది. ఇక కాలిక్యులేటర్‌ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ.10 వేలు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీపై మొత్తం రూ.69,6967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్‌ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తం రూ.99967 అవుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ వివరాలన్ని వివిధ వెబ్‌సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు స్కీమ్‌లో చేరి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి:

Railway Stations: ప్రపంచంలోని టాప్‌ 10 అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఏమిటో తెలుసా..? టాప్‌లో 7 భారత్‌కు చెందినవే..!

Loan Scheme: ఈ బ్యాంకు కొత్త స్కీమ్‌ ప్రారంభించింది.. ఇందులో రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం

PM Jan Dhan Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న జన్‌ ధన్‌ యోజన పథకం.. 31.67 రూపే కార్డుల జారీ

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!