PM Jan Dhan Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న జన్‌ ధన్‌ యోజన పథకం.. 31.67 రూపే కార్డుల జారీ

PM Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన (PMJDY) .. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనాలు తీసుకువచ్చింది..

PM Jan Dhan Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న జన్‌ ధన్‌ యోజన పథకం.. 31.67 రూపే కార్డుల జారీ
Follow us

|

Updated on: Nov 09, 2021 | 10:13 AM

PM Jan Dhan Yojana: ప్రధానమంత్రి జన్‌ ధన్ యోజన (PMJDY) .. దేశ ప్రజలందరికీ సుపరిచితమైన పేరు ఇది. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనాలు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ తొలి విడత సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కీలకమైన పథకాల్లో ఇదీ ఒకటి. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించిన స్కీమ్. ఒకరకంగా నరేంద్ర మోడీ మానస పుత్రికగా దీనిని చెప్పుకోవచ్చు. అయితే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది జన్‌ధన్‌ యోజన ఖాతాలు పొందారు. ఈ రూపే కార్డు వల్ల వారికి రుణాలు అందాయి. దీని వల్ల ఎవరికి వారు చిన్న పాటి వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా లాభం పొందుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య కూడా తగ్గినట్లు ఎస్‌బీఐ నివేదిక చెబుతోంది.

అయితే దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక ప్రకారం.. ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన కింద ఖాతాదారులకు ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందిస్తూ బ్యాంకులు 31.67 కోట్ల రూపే డెబిట్‌ కార్డులు జారీ చేశాయి.

43.76 ఖాతాలు:

2014 ఆగస్టులో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ నుంచి ఇప్పటి వరకు 43.76 కోట్ల జన్‌-ధన్‌ ఖాతాలె తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. మంత్రిత్వశాఖ ఆర్థిక సేవల విభాగం ఓ ట్వీట్‌ చేసింది. జన్‌ ధన్‌ ఖాతాదారులకు అక్టోబర్‌ 21, 2021 వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజీని అందించే 31.67 కోట్ల రూపే డెబిట్‌ కార్డులు జారీ అయినట్లు కేంద్రం తెలిపింది.

2 లక్షల ప్రమాద బీమా కవరేజీ:

2014,ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్‌ ధన్‌ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అదే నెల అంటే ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. 2018లో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా అందించాలనే లక్ష్యంతో జన్‌ ధన్‌ యోజన 2.0ని ప్రారంభించింది కేంద్రం. రూపే డెబిట్‌ కార్డులపై అందించే ఉచిత ప్రమాద బీమా కవరేజీని కూడా రెట్టింపు చేసి రూ.2 లక్షల వరకు పెంచారు.

ఈ పథకం కింద తెరవబడిన ఖాతాల సంఖ్య మార్చి 2015 నాటికి 14.72 కోట్లు ఉంది. ఇది అక్టోబర్‌ 2021 నాటికి 43.76 కోట్లకు చేరింది. అయితే ఖాతాలు పొందిన వారిలో 55 శాతం మహిళలే ఉన్నారు. ఈ జాతీయ మిషన్‌ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్యాంకింగ్‌, క్రెడిట్‌, ఇన్సూరెన్స్‌, పెన్షన్‌ వంటి ఆర్థిక సేవలను పొందేలా చేయడం కోసం దీనిని ప్రారంభించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా కేంద్ర ప్రత్యేక చర్యలు చేపట్టారు.

బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి కోట్లమంది..

కోట్లాదిమంది దేశ ప్రజలను బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలోకి తీసుకొచ్చిన ఒకే ఒక్క వ్యవస్థ ఇది. అప్పటిదాకా బ్యాంకుల గురించి పెద్దగా తెలియని, పరిచయం లేని పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కోట్లాదిమంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

RBI: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి రూ.5వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు.. ఆర్బీఐ కీలక నిర్ణయం!

Loan Scheme: ఈ బ్యాంకు కొత్త స్కీమ్‌ ప్రారంభించింది.. ఇందులో రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం