RBI: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి రూ.5వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు.. ఆర్బీఐ కీలక నిర్ణయం!

RBI: బ్యాంకింగ్‌ రంగం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన బాబాజీ డేట్‌ మహిళా..

RBI: ఆ బ్యాంక్‌ కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక నుంచి రూ.5వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు.. ఆర్బీఐ కీలక నిర్ణయం!
Follow us

|

Updated on: Nov 09, 2021 | 9:15 AM

RBI: బ్యాంకింగ్‌ రంగం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన బాబాజీ డేట్‌ మహిళా సహకారి బ్యాంక్‌, యవత్మాల్‌కు ఆర్బీఐ షాకిచ్చింది. సహకార బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ చర్యలకు దిగింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, 1949 కింద విధించిన ఆంఓలు నవంబర్‌ 8, 2021 ముగిసిన నాటి నుంచి ఆంక్షలు విధించింది. విత్‌డ్రా పరిమితులపై షరతులు విధించింది. ఈ కారణంగా బ్యాంకు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడే అకాశం ఉంది. బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్న కేవలం రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంకు ఇకపై కొత్త డిపాజిట్లు తీసుకోకూడదని ఆంక్షలు పెట్టింది. అలాగే కస్టమర్లకు ఎలాంటి రుణాలు ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ పొజిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

అలాగే కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న మిల్లత్‌ కో- ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై కూడా ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ఈ ఆంక్షలు మూడు నెలల పాటు అంటే ఫిబ్రవరి 7, 2022 వరకు పొడిగించింది. ఇక కర్ణాటకలోని సహకార బ్యాంకుపై ఏప్రిల్‌ 26,2019న నిషేధం విధించింది. కాలానుగుణంగా సవరించబడింది. చివరిసారిగా ఆంక్షలను నవంబర్‌ 7 వరకు పొడిగించింది రిజర్వ్‌ బ్యాంక్‌.

ఇవి కూడా చదవండి:

Loan Scheme: ఈ బ్యాంకు కొత్త స్కీమ్‌ ప్రారంభించింది.. ఇందులో రూ.50 కోట్ల వరకు రుణ సదుపాయం

PPF Accounts Merger: ఇక నుంచి ఒకే పీపీఎఫ్‌ ఖాతా.. అకౌంట్ల విలీనంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు