AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Changing Rules: మారుతున్న రూల్స్..ఇకపై వస్తువుల ప్యాకేజీలపై ఎమార్పీతో పాటు దానిని కూడా చెప్పాల్సిందే!

అన్ని వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్రతి ప్యాక్ చేసిన వస్తువుల రేటును రెండు విధాలుగా ఆ ప్యాకేజీలపై పేర్కొనవలసి ఉంటుంది. ఒక రేటు గరిష్ట రిటైల్ ధర(MRP)ను సూచిస్తే, మరొక రేటు ఆ ప్యాక్ లోని వస్తువు యూనిట్ ధర(Unit Price) సూచిస్తుంది.

Changing Rules: మారుతున్న రూల్స్..ఇకపై వస్తువుల ప్యాకేజీలపై ఎమార్పీతో పాటు దానిని కూడా చెప్పాల్సిందే!
Change Rules On Package Rates Display
KVD Varma
|

Updated on: Nov 09, 2021 | 9:32 AM

Share

Changing Rules: అన్ని వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్రతి ప్యాక్ చేసిన వస్తువుల రేటును రెండు విధాలుగా ఆ ప్యాకేజీలపై పేర్కొనవలసి ఉంటుంది. ఒక రేటు గరిష్ట రిటైల్ ధర(MRP)ను సూచిస్తే, మరొక రేటు ఆ ప్యాక్ లోని వస్తువు యూనిట్ ధర(Unit Price) సూచిస్తుంది. అంటే 5 కిలోల పిండి ప్యాకెట్ ఉంటే దానిపై మొత్తం 5 కిలోల ప్యాక్ ధర (ఎంఆర్పీ) తో పాటుగా 1 కిలో పిండి రేటు కూడా ప్యాకేజీపై ముద్రిస్తారు. ఇతర కంపెనీలతో పోలిస్తే కస్టమర్‌లు ఆ వస్తువును ఎంత ఖరీదైన లేదా చౌకగా తీసుకుంటున్నారనే విషయాన్నీ ఇది తెలియచేస్తుంది. ఈ కొత్త రూల్ 1 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి రాబోతోంది. దీంతో వినియోగదారులు యూనిట్ ధరను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

దీని కోసం ఆహార వినియోగదారుల మంత్రిత్వ శాఖ లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011ని సవరించింది. ఈ కొత్త రూల్ ప్రకారం, కంపెనీలు ప్యాక్ చేసిన వస్తువుపై యూనిట్ విక్రయ ధరను కూడా రాయాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లు కొనుగోళ్లపై లాభనష్టాల సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు. ఉదాహరణకు, మీరు రెండు కంపెనీల నుండి 5 కిలోల పిండిని తీసుకున్నారని అనుకుందాం. కొత్త రూల్ ప్రకారం, రెండు ప్యాకెట్లపై రాసుకున్న యూనిట్ విక్రయ ధర ద్వారా ఏ కంపెనీ వస్తువులు తక్కువ ధరకు లభిస్తున్నాయో, ఎవరి వస్తువులు మీకు భారం అవుతున్నాయో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ప్యాకెట్‌పై ఎంఆర్పీఅని కూడా రాయాలి. వివిధ కంపెనీల ఎంఆర్పీ ఒకేలా ఉండవచ్చు, కానీ యూనిట్ విక్రయ ధరలో తేడా ఉండవచ్చు.

కొత్త నియమం ఇదే!

కొత్త నిబంధన ప్రకారం, 1 కిలో కంటే ఎక్కువ ప్యాకెట్లను తయారు చేసే కంపెనీలు కూడా కిలో యూనిట్ విక్రయ ధరను వ్రాయాలి. ఇది కాకుండా, ఎంఆర్పీ రాయడం కూడా తప్పనిసరి. ఉదాహరణకు, 5 కిలోల పిండి ప్యాకెట్‌పై, 1 కిలోల పిండి ధర కూడా పేర్కొనాల్సి ఉంటుంది. ఇది యూనిట్ విక్రయ ధర అవుతుంది. ఆ మొత్తం ప్యాకెట్ ఎంఆర్పీ కలిపి రాయవలసి ఉంటుంది. ఒక ప్యాకెట్ 1 కిలో కంటే తక్కువ ఉంటే, అప్పుడు ఒక గ్రాము యూనిట్ విక్రయ ధర దానిపై చూపించాలి. దీంతో వినియోగదారులు ఒక్కో గ్రాముకు ఎంత డబ్బు చెల్లిస్తున్నారో తెలుసుకోవచ్చు.

రేటు ఎలా పేర్కొంటారు?

లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011ని సవరించడానికి, ఆహార వినియోగదారుల మంత్రిత్వ శాఖ షెడ్యూల్ 2 చట్టాన్ని తొలగించింది. పాత నిబంధన ప్రకారం, బియ్యం లేదా గోధుమ పిండిని 100 గ్రా, 200 గ్రా, 500 గ్రా, 1 కిలో, 1.25 కిలోలు, 1.5 కిలోలలో ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. అనేక రకాల బరువు ప్యాకెట్లు ఇందులో చేర్చారు. కంపెనీలు ప్యాక్ చేసిన వస్తువులను వేర్వేరు పరిమాణంలో విక్రయించాలని చూస్తున్నాయని, ఇందుకోసం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి కోరింది. కంపెనీల డిమాండ్లలో కొన్నిటిని ఆమోదించారు. మరి కొన్నిటిని ఆమోదించలేదు. మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 2ను రద్దు చేయడం ద్వారా యూనిట్ విక్రయ ధర అనుమతించారు.

మార్పులు ఇవీ..

ఆహార మంత్రిత్వ శాఖ కూడా ఎంఆర్పీ పేర్కొనడానికి సరైన మార్గం ఉండాలని మరియు దానిలో ఏదైనా లోపం ఉంటే నోటీసుకు కాల్ చేయవచ్చని తెలిపింది. ఉదాహరణకు ప్రస్తుత ఎంఆర్పీ ఈ విధంగా పేర్కొనాలి.. రూ.3.80. ఒక కంపెనీ కేవలం 3 మాత్రమే రాస్తే దానిపై చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంపెనీలకు భారతీయ రూపాయలలో ఎంఆర్పీ పేర్కొనాలని చెప్పారు. అంటే డబ్బు ప్రస్తావన తొలగించారు. ప్యాక్ చేయబడిన వస్తువుల పరిమాణాలు 3N లేదా 3U వంటి సంఖ్యలు లేదా యూనిట్లలో రాయవచ్చు. ఇక్కడ N అంటే సంఖ్య అదేవిధంగా U అంటే యూనిట్. కంపెనీలు ఇప్పుడు సంఖ్యలు లేదా యూనిట్లలో పరిమాణాలను వ్రాయవచ్చు. కంపెనీలు బాక్స్ లేదా ప్యాకెట్‌పై తయారీ తేదీని కూడా రాయవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Electric Vehicles: వచ్చే రెండేళ్లలో పెట్రోల్ వాహనాలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!

US vs China: పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అమెరికా యుద్ధ నౌక మోడల్ సహాయంతో ప్రాక్టీస్ చేస్తున్న చైనా సైన్యం!

ZyCoV-D Vaccine: సూది నొప్పి లేకుండా మన దేశ టీకా.. మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ జైకొవ్-డి ధర నిర్ణయించిన ప్రభుత్వం..ఎంతంటే..