AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ..

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.

Delhi: కవిత కేసులో నేడు కీలకం.. కోర్టుకు హాజరుపరుచనున్న ఈడీ..
Kavita
Srikar T
|

Updated on: Apr 22, 2024 | 10:05 AM

Share

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరో నాలుగు రోజులు కవితను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు బెయిల్‌ పిటిషన్‌పై కూడా కోర్టులో నేడు వాదనలు వినిపించనున్నారు కవిత తరఫు న్యాయవాదులు. దీంతో కవితకు బెయిల్‌ వస్తుందా? రాదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పాలసీలో కేజ్రీవాల్‌, కవిత ఇద్దరూ ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో 100కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్‌ గ్రూపునకు అనుకూలంగా మార్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌తో కలిసి కవితని ప్రశ్నించేందుకు మరో నాలుగు రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ కోర్టులో వాదించే అవకాశం ఉంది.

ఇక కోర్టు అనుమతితో కవితను రెండు విడతల్లో మొత్తం పదిరోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ.. పలు అంశాలపై ఆమెను విచారించింది. నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు? ఎక్కడ నుండి ఎక్కడికి తరలించారు? ఇందులో మేకా శరణ్ పాత్ర ఏంటి? అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేక శరణ్‌ నివాసాల్లో తనిఖీలు సాగాయి. ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్‌ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తోంది. ముడుపుల చెల్లింపులో శరణ్‌దే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు.అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని.. తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇవాళ్టి విచారణలో కూడా ఇవే అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది. 2022లో ఢిల్లీ లిక్కర్‌ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సీబీఐ వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖలను అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..