Congress List: మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఎవరికి ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారంటే..?
2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా , కాంగ్రెస్ ఆదివారం (ఏప్రిల్ 21) మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, జార్ఖండ్ నుంచి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గొలు కృష్ణ పేర్లను ఖరారు చేసింది అధిష్టానం.
2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా , కాంగ్రెస్ ఆదివారం (ఏప్రిల్ 21) మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, జార్ఖండ్ నుంచి ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గొలు కృష్ణ పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. జార్ఖండ్‌లోని గొడ్డా నుంచి దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, రాంచీ అభ్యర్థిగా యశస్విని సహాయ్‌ను ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుంచి పెడాడ పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గొలు కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ, ఒంగోలు నుంచి ఈదా సుధాకర్‌రెడ్డి, నంద్యాల నుంచి జంగీటి లక్ష్మీ నరసింహ యాదవ్‌లను పార్టీ బరిలోకి దింపింది. అనంతపురం నుంచి మల్లికార్జున్‌కు, హిందూపురం నుంచి సమద్ షాహీన్‌కు టికెట్ ఇచ్చారు.
कांग्रेस ने आंध्र प्रदेश और झारखंड के लिए लोकसभा उम्मीदवारों की सूची जारी की।
कांग्रेस ने झारखंड के गोड्डा से दीपिका सिंह पांडे की जगह प्रदीप यादव को अपना उम्मीदवार घोषित किया है।#LokSabhaElections2024 pic.twitter.com/P9UwcYgsvQ
— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
జార్ఖండ్‌లోని గొడ్డా లోక్‌సభ స్థానం నుంచి నిషికాంత్ దూబేకి బీజేపీ టికెట్ ఇచ్చింది. కాగా, రాంచీ లోక్‌సభ స్థానానికి బీజేపీ సంజయ్ సేథ్‌ను బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, జార్ఖండ్‌లో మొత్తం 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏఫ్రిల్ ప్రారంభంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాల జాబితాను విడుదల చేసింది. ఇక వచ్చేనెల 13న ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో పోలింగ్ జరుగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…