రాత్రంతా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోనే డీకే శివకుమార్
కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవల్స్ పెరగడంతో ఆయనను మంగళవారం రాత్రి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై గత నాలుగు రోజులుగా ఆయనను విచారిస్తున్న ఈడీ అధికారులు.. మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలపై సమాధానం దాటవేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. […]

కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అస్వస్థతకు గురయ్యారు. బీపీ లెవల్స్ పెరగడంతో ఆయనను మంగళవారం రాత్రి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై గత నాలుగు రోజులుగా ఆయనను విచారిస్తున్న ఈడీ అధికారులు.. మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలపై సమాధానం దాటవేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు డీకే శివకుమార్ అరెస్ట్‌పై కర్ణాటక రగులుతోంది. పలు చోట్ల బీజేపీ కార్యాలయాలపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇక శివ కుమార్ అరెస్ట్‌ను మాజీ సీఎంలు సిద్ధ రామయ్య, కుమార స్వామి ఖండించారు. దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే శివకుమార్ అరెస్ట్‌ను ఖండిస్తూ నేడు కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.