AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGCA: విమాన సిబ్బందికి మళ్లీ ఆ పరీక్షలు తప్పవు.. DGCA కీలక నిర్ణయం.. ఎప్పటినుంచి అంటే..

కరోనా వైరస్ అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిద్ విజృంభణతో గతంలో ఉన్న నిబంధనలు సడలించి.. కొత్త ప్రొటోకాల్స్ ను అందుబాటులోకి తీసుకురావల్సి వచ్చింది. ఇదేదో ఒక రంగానికి పరిమితం..

DGCA: విమాన సిబ్బందికి మళ్లీ ఆ పరీక్షలు తప్పవు.. DGCA కీలక నిర్ణయం.. ఎప్పటినుంచి అంటే..
Breat Analyser
Amarnadh Daneti
|

Updated on: Sep 15, 2022 | 7:25 AM

Share

DGCA: కరోనా వైరస్ అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిద్ విజృంభణతో గతంలో ఉన్న నిబంధనలు సడలించి.. కొత్త ప్రొటోకాల్స్ ను అందుబాటులోకి తీసుకురావల్సి వచ్చింది. ఇదేదో ఒక రంగానికి పరిమితం కాలేదు. దాదాపు అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థల్లో కొత్త ప్రొటోకాల్స్ రూపొందించారు. అలాగే విమానాయాన రంగంలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో విమాన ప్రయాణం మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. దీంతో కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సిబ్బందికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలను పునరుద్దరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈఏడాది అక్టోబరు 15 నుంచి పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది సహా ప్రతి ఉద్యోగికి ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. విమానయాన సిబ్బంది మద్యం తాగారా లేదా అన్నది తెలుసుకునేందుకు రోజువారీ బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొవిడ్‌ విజృంభణ తర్వాత ఈ నిబంధనపై కొన్ని పరిమితులు విధించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ సిబ్బందిలో 50శాతం మందికి మాత్రమే ఈ శ్వాస పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 2021 మే నెలలో దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు.. గంటకు ఆరు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆదేశాలను న్యాయస్థానం ఇటీవల సవరించింది. దీంతో పాటు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టడం, ప్రయాణికుల రద్దీ పెరగడంతో బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు DGCA ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి విమాన, క్యాబిన్‌ సిబ్బందికి బ్రీత్ అనలైజర్‌ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. పెద్ద, బహిరంగ ప్రదేశంలో ఈ పరీక్షలు నిర్వహించాలని, అక్కడ సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ పరీక్షలు నిర్వహించే వైద్యులు, నర్సులు.. ముందుగా విమాన సిబ్బందికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది పరీక్షించాలని తెలిపింది. ఒకవేళ ఏ సిబ్బందికైనా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలితే, ఆ వ్యక్తికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నుంచి మినహాయింపు కల్పించి విధుల నుంచి సెలవు ఇవ్వాలని సూచించింది. బ్రీత్ అనలైజర్ పరీక్షల సమయంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ గా తేలితూ అలాంటి కేసుల రికార్డులను జాగ్రత్తపర్చాలని DGCA ఇచ్చిన ఆదేశాల్లో తెలిపింది. బ్రీత్ అనలైజర్ పరీక్షల కోసం ఉపయోగించే పరికరాలను తప్పనిసరిగా శానిటైజ్‌ చేయాలని తెలిపింది. విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులు ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు అక్టోబరు 15 వరకు గడువు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..