Power Subsidy: ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ.. ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..

Power Subsidy: ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ ఇస్తోంది. అయితే, అందరికీ కాకుండా కేవలం అప్లై చేసుకున్న వారికే ఈ రాయితీ..

Power Subsidy: ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ.. ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..
Power Subsidy
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 15, 2022 | 6:33 AM

Power Subsidy: ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ ఇస్తోంది. అయితే, అందరికీ కాకుండా కేవలం అప్లై చేసుకున్న వారికే ఈ రాయితీ అందిస్తామని తెలిపింది. అవును, హస్తీనలో అప్పుడే ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. రెండు నెలల్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో మున్సిపల్‌ ఎలక్షన్లతో పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ, ఆప్‌ మధ్యలో కాంగ్రెస్‌ అన్నట్లు ఉంది పార్టీల పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకుని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఢిల్లీలోనూ ఉన్న మున్సిపల్ ఎలక్షన్‌ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ సబ్సిడీ పొందేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీలోని విద్యుత్ వినియోగదారులు ఒక్క మిస్డ్ కాల్‌ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

అయితే, అందరికీ కాకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ రాయితీ అందిస్తామని తెలిపింది. మరోవైపు బీజేపీ.. ఆప్‌కి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఆ పార్టీని బీజేపీ ఇరుకున పెడుతుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా కేజ్రీవాల్‌పై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టింది. ఆప్ అంటే అరవింద్ అడ్వర్టైజ్‌మెంట్ పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ప్రకటనల కోసం పంజాబ్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించింది. భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోతోందని.. అదే గుజరాత్‌లో యాడ్స్ కోసం గత రెండు నెలల్లో రూ. 36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు