AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: హస్తీనలో పెరిగిన ఎన్నికల వేడి.. ఢిల్లీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ

Delhi: హస్తీనలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. రెండు నెలల్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో మున్సిపల్‌ ఎలక్షన్లతో పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి...

Delhi: హస్తీనలో పెరిగిన ఎన్నికల వేడి.. ఢిల్లీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఒక్క మిస్ట్ కాల్‌తో విద్యుత్ బిల్లుపై సబ్సిడీ
Cm Arvind Kejriwal
Subhash Goud
|

Updated on: Sep 14, 2022 | 9:17 PM

Share

Delhi: హస్తీనలో ఎలక్షన్‌ హీట్‌ మొదలైంది. రెండు నెలల్లో గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో మున్సిపల్‌ ఎలక్షన్లతో పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ, ఆప్‌ మధ్యలో కాంగ్రెస్‌ అన్నట్లు ఉంది పార్టీల పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీ నమూనాను ప్రచారాస్త్రంగా చేసుకుని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఢిల్లీలోనూ ఉన్న మున్సిపల్ ఎలక్షన్‌ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులకు ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ సబ్సిడీ పొందేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఢిల్లీలోని విద్యుత్ వినియోగదారులు ఒక్క మిస్డ్ కాల్‌ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. అయితే అందరికీ కాకుండా కేవలం దరఖాస్తు చేసుకున్న వారికే ఈ రాయితీ అందిస్తామని తెలిపింది. మరోవైపు బీజేపీ ఆప్‌కి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఆ పార్టీని బీజేపీ ఇరుకున పెడుతుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా కేజ్రీవాల్‌పై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టింది. ఆప్ అంటే అరవింద్ అడ్వర్టైజ్ మెంట్ పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ప్రకటనల కోసం పంజాబ్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించింది. భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోతోందని, అదే గుజరాత్‌లో యాడ్స్ కోసం గత రెండు నెలల్లో 36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!