కుక్క’చావు’లు.. ఆపేదెలా?.. సుప్రీం ఆదేశించినా.. రాష్ట్రాలు పట్టించుకోనంత నిర్లక్ష్యమేంటి?
నిజామాబాద్ బాల్కొండలో పదేళ్ల పాప లక్ష్మణను కుక్క కరిచింది. తలకు గాయం అయింది. ఇంట్లో చెబితే తిడతారని చెప్పకుండా దాచింది. పదిరోజుల తరువాత పాపలో విచిత్ర లక్షణాలు మొదలయ్యాయి.. అచ్చం కుక్కలా. అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తే.. అప్పటికే రేబిస్ కన్ఫామ్ అయింది. ఒక్కసారి రేబిస్ సోకిందంటే.. దానికిక చికిత్స లేదు. ఇంతవరకు మెడిసిన్, వ్యాక్సిన్ కనుక్కోలేదు. చావు తప్ప మరో దారి లేదు. ఆ పదేళ్ల పాప కూడా కొట్టుమిట్టాడుతూ ప్రాణం వదిలింది. ఆగస్ట్ తరువాత దేశవ్యాప్తంగా 26 లక్షల మందిని కుక్కలు కరిచాయి. ఏం.. పర్టిక్యులర్‌గా ఆగస్ట్ నుంచే ఎందుకు చెప్పుకోవాలి? ఈ ఏడాది ఆగస్ట్ 22న సుప్రీం కోర్టు ఓ డైరెక్షన్ ఇచ్చింది. వీధికుక్కలకు స్టెరిలైజేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని ఆదేశాలిచ్చింది. అయినా సరే.. రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. సుప్రీం ఆదేశాలను ఖాతరు చేయలేదు. ప్రాణాలు పోవడం కాదు.. దేశం పరువు పోతోందని సీరియస్ కామెంట్సే చేసింది సుప్రీం. ఎందుకని రాష్ట్రాలకు ఇంత నిర్లక్ష్యం? మరిన్ని చావులు చూడాలనుకుంటున్నాయా? రేబిస్ కేసులు పెంచాలనుకుంటున్నాయా? జంతు ప్రేమికులు సైతం కోరుకుంటున్నదే కదా? మరి ప్రభుత్వాలకు అడ్డొస్తున్నదేంటి? కంప్లీట్ డిటైల్స్...

వీధిలోకి వెళ్లిన పిల్లలు సేఫ్‌గా ఇంటికొస్తారన్న గ్యారెంటీ ఉండడం లేదు. ఆడుకోడానికి పంపిద్దామన్నా ధైర్యం చాలడం లేదు. తెలిసిన ఏరియానే, రోజూ చూస్తున్న కుక్కలే. అయినా సరే.. ఒక్కోసారి పిల్లల్ని పట్టి పీకకుండా వదలడం లేదు. అసలు వీధికుక్కల ప్రాణాలు ముఖ్యమా? మనుషుల ప్రాణాలు ముఖ్యమా? దీనిపై పెద్ద డిబేట్ నడిపింది టీవీ9. ఈ సందర్భంలో సుప్రీంకోర్ట్ చేసిన ఓ కీలక కామెంట్ చెప్పుకోవాలి. మీడియాలో వరుస కథనాలు వస్తున్నా అధికారుల్లో చలనం లేదా అని ప్రశ్నించింది. బాధ్యతగా మీడియా తన పని తాను చేస్తున్నప్పుడు అధికారులకెందుకీ నిర్లక్ష్యం అని నిలదీసింది. అసలు రాష్ట్రాల సమస్యేంటి? సుప్రీం కోర్ట్ సీరియస్ అవడానికి 24 గంటల ముందు జరిగిన సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.. హన్మకొండలోని శాయంపేటలో ఏడేళ్ల శ్రీజ.. వీధి చివరనున్న షాప్‌కు వెళ్లింది. ఎప్పుడూ వెళ్లే దారే, రోజూ కంటపడే కుక్కలే కదా అనుకుంది. వాటికి ఏం రేగిందో గానీ ఒక్కసారిగా మీదపడ్డాయి. ఒకట్రెండు కాదు.. దాదాపు పది కుక్కలు మీద పడి కరిచేశాయి. చిన్నపిల్లల్ని చూస్తే ముందుగా తలనే టార్గెట్ చేస్తాయి కుక్కలు. శ్రీజను పట్టి పీకింది కూడా తలమీదే. విలవిలలాడిపోయింది ఆ పాప. ఓ వ్యక్తి అలర్ట్ అయి కుక్కల్ని తరిమేశాడు కాబట్టి ప్రాణం దక్కింది గానీ.. లేకుంటే! ఇక ఇంతేనా. స్కూలుకు పంపాలన్నా, తోటి పిల్లలతో ఆడుకోనివ్వాలన్నా, సరదాగా బయట తిరగాలన్నా భయపడాల్సిందేనా? చావాల్సిందేనా? అధికారులకు కనీస బాధ్యత లేదా?...




