AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper Train: అత్యాధునిక హంగులతో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్.. ఇంటీరియర్ చూస్తే మతిపోవాల్సిందే

భారత రైల్వే రూపురేఖలను మార్చిన వందే భారత్‌ ట్రైన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని మార్పులు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగానే వందే భారత్‌ స్లీపర్ ట్రైన్స్‌ను కూడా రైల్వేశాఖ తీసుకురానుంది. అతి త్వరలోనే ఈ స్లీపర్ ట్రైన్‌లు పట్టాలు ఎక్కనున్నాయి. అయితే తాజాగా ఈ వందేభారత్‌ స్లీపర్ కోచ్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్యాబిన్‌లోని ఇంటీరియర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Vande Bharat Sleeper Train: అత్యాధునిక హంగులతో వందేభారత్‌ స్లీపర్‌ కోచ్.. ఇంటీరియర్ చూస్తే మతిపోవాల్సిందే
Vande Bharat Sleeper Train
Anand T
|

Updated on: Oct 27, 2025 | 9:59 PM

Share

భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే ఈ స్లీపర్‌ ట్రైన్‌ను అత్యానిధునిక హంగులతో తీర్చిదిద్దింది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా విమానాల స్ఫూర్తితో కూడిన ఇంటీరియర్‌లు, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో ప్రీమియం అనుభవాన్ని అందిచేలా క్యాబిన్‌ను డిజైన్ చేసింది. అయితే వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లోని ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌కు సంబంధించిన నమూనా వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ నమూనా వీడియోలో ఫస్ట్-క్లాస్ స్లీపర్ క్యాబిన్‌లు, ఎర్గోనామిక్ సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, రీడింగ్ లైట్లు, వై-ఫై కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పాయింట్లు, డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్‌లు, సెన్సార్ ఆధారిత లైటింగ్ ఉన్నాయి. ఇవి నెటిజన్లను ఎంతగానో అకర్షించాయి. ఇది చూడ్డానికి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ డిజైన్‌ను ప్రశంసిస్తూ, భారతదేశ ఇంజనీరింగ్ పురోగతిపై గర్వం వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ప్రజా రవాణాలో అలాంటి లగ్జరీని క్యాబిన్‌లను ఏర్పాటు చేస్తే.. జనాలు వాటిని నాశనం చేస్తారని చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by Chennaites (@chennaites.in)

మరికొందరు ఈ ప్రీమియం సేవలను పొందే అర్హతను నిర్ణయించడానికి క్రెడిట్ స్కోర్ మాదిరిగానే “పౌర స్కోర్” వ్యవస్థను ప్రవేశపెట్టాలని కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా భారతదేశపు మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ ట్రైన్‌లో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మరో వ్యక్తి కామెంట్ చేశారు.

దేశంతో మొదటి వందేభారత్‌ ట్రైన్

ఇక దేశంలో మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్ ఢిల్లీ-పాట్నా మార్గంలో నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రైన్ గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది. ఈ మొట్టమొదటి వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ 16-కోచ్‌ల కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది, ఇందులో పదకొండు AC 3-టైర్ కోచ్‌లు, నాలుగు AC 2-టైర్ కోచ్‌లు, ఒక AC ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి, 823 స్లీపర్ బెర్త్‌లతో దాదాపు 1,128 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి