Air Pollution: కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
Air Pollution: వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. అక్కడ రోజురోజుకు కాలుష్యం తీవ్రతరం అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతూనే ఉన్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గేలా కనిపించడంలేదు. రోజురోజుకూ కాలుష్యం తీవ్రమవుతోంది. ఈ పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉంది. ఢిల్లీలోనే కాదు.. ఉత్తరభారతంలోని చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరిగిపోయాయి. నోయిడా, ఘజియాబాద్, ప్రయాగరాజ్, అలీగఢ్, ముంబై లాంటి ప్రదేశాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి 358గా నమోదైంది. అలీపూర్‌లో ఏక్యూఐ 372గా, బావన ప్రాంతంలో 412, ద్వారకా సెక్టార్ 8లో 355, ముంద్కాలో 419, రోహిణిలో 401, పంజాబి బాగ్‌లో 388గా నమోదైంది.
ఇది కూడా చదవండి: Tax Evasion: అధికారుల మైండ్‌బ్లాంక్..18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
ఇక దేశరాజధాని ఛట్ పూజ వేడుకలకు రెడీ అవుతోంది. యమునా నదితీరంలో పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు పూజపై కొన్ని ఆదేశాలు జారీచేసింది. యమునా నది ఒడ్డున ఉన్న గీతా కాలనీ ఘాట్‌ల దగ్గర నిషేధాన్ని ఎత్తేయాలంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాని.. హైకోర్టు మాత్రం నిరాకరిచింది. విషతుల్యమైన నీటిలో ప్రజలు దిగి పూజలు నిర్వహించడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే నీటిలో దిగకుండా పూజలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యమునా నది ఇంకా నురగలు కక్కుతూనే ఉంది. నురగలు కక్కుతూ ప్రవహిస్తోంది. నాలుగు వారాలుగా నది పరిస్థితి ఇలానే ఉంది. నదిలో నీరు ఇప్పటికే విషమంయగా మారిపోయాయి. తాగడానికి కాదుకదా.. కనీసం పాదాలను శుభ్రం చేసుకునేందుకు కూడా ఈ నీరు పనికి రాకుండా పోయాయి.
ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!
కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక మార్గాలను ఆశ్రయిస్తోంది. గాల్లోకి నీటిని జల్లుకుంటూ వెల్లడం వల్ల కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. కొంత వరకు ఫలితాలను ఇస్తున్నా.. పూర్తిస్థాయిలో ఇది పరిష్కారం కాదని నిపుణులు అంటున్నారు. కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు కచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు.
ఇది కూడా చదవండి: Hidden Camera Detector: హోటల్ గదులలో సిక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసా?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి