Rajasthan: కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. శిశువులను చూసి అరుపులు..దగ్గరకు తీసుకోవడానికి భయపడ్డ తల్లి

ఒక మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తన కడుపున పుట్టిన చిన్నారులను చూడగానే ఆమె భయంతో అరిచింది. ఎందుకంటే ఆ చిన్నారులకు కళ్ళ స్థానంలో స్కిన్ ఉంది. అంతేకాదు అరుదైన స్కిన్ వ్యాధితో జన్మించిన తన పిల్లలను చూడగానే భయపడింది. ఇప్పుడు పిల్లలను ఆ కుటుంబ సభ్యులు ఒడిలోకి తీసుకోవడానికి భయపడుతున్నాయి. చూడడానికి కూడా ఆసక్తిని చూపించడం లేదు. వైద్యులు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఈ విచిత్ర ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.

Rajasthan: కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. శిశువులను చూసి అరుపులు..దగ్గరకు తీసుకోవడానికి భయపడ్డ తల్లి
Twins Born With Rare Skin DiseaseImage Credit source: Representative image
Follow us

|

Updated on: Nov 07, 2024 | 10:21 AM

ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లి కాబోతున్న సమయంలో ఆ అనుభూతిని అనుభవిస్తూ ప్రపంచంలోకి తన పిల్లలు అడుగు పెట్టే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అందమైన అనుభూతి కోసం తొమ్మిది నెలలు ఎదురు చూస్తుంది. 9 నెలల పాటు తన కడుపులో ఉన్న చిన్నారి లోకంలోకి వచ్చే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంది. తల్లికి తన బిడ్డ కంటే ప్రపంచంలో ఎవరూ ముఖ్యమైనవారు కాదు. తన కడుపున పుట్టిన పిల్లలు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా.. అందంగా ఉన్నాడని భావిస్తుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అయితే రాజస్థాన్‌లో ఒక మహిళ తనకు పుట్టిన కవల పిల్లలను చూసి చాలా భయపడిపోయింది. చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ఇష్టపడ లేదు. ఎందుకంటే

రాజస్థాన్‌లోని బికనీర్‌లోని నోఖా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ కవలలకు జన్మనిచ్చిన ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ ఇంటికి కవలలు రాబోతున్నారని కుటుంబసభ్యులకు అప్పటికే తెలిసింది. దీంతో అందరూ చాలా సంతోషించారు. కవలలు తమ ఇంటిలోకి అడుగు పెట్టే రోజు కోసం ఆ కుటుంబం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసింది. వారు ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. అయితే పుట్టిన పిల్లలని పట్టుకునేందుకుపిల్లలకు జన్మనిచ్చిన తల్లి సహా కుటుంబ సభ్యులు అందరూ భయపడ్డారు.

పిల్లలకు ఈ వ్యాధి ఉంటుంది

ఇవి కూడా చదవండి

ఓ గర్భిణీ స్త్రీ బికనీర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది. ఆ నవజాత శిశువులు అరుదైన చర్మవ్యాధితో జన్మించారు. పిల్లలిద్దరి చర్మం పూర్తిగా అభివృద్ధి చెందలేదు, దీని కారణంగా పిల్లల శరీరమంతా గాయాలు ఉన్నాయి. పిల్లలు జన్మించక ముందే వారి పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వైద్యులు కూడా పుట్టిన పిల్లల పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం చిన్నారులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బహుశా దేశంలో మొదటి కేసు అని అన్నారు. మూడు నుంచి ఐదు లక్షల మంది పిల్లల్లో ఒక బతికి ఉన్న బిడ్డ పుడుతుందని తెలిపారు.

కళ్లకు బదులుగా చర్మం

చిన్నారులు చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పిల్లల కాళ్ళ స్థానంలో చర్మం ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు పుట్టిన పరిస్థితి చూస్తుంటే బతకడం కష్టమే అని అంటున్నారు. ఇలాంటి సీరియస్ పరిస్థితుల్లో పుట్టిన పిల్లలు వారం రోజులు కూడా బాగా ఉండరు. అయితే వైద్యులు పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో ఏమీ చెప్పడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..