Gujarat: సూరత్‌లోని స్పా సెంటర్‌లో అగ్ని ప్రమాదం, ఊపిరాడక ఇద్దరు యువతులు మృతి
గుజరాత్ సూరత్‌లోని సిటీ లైట్ ప్రాంతంలోని సన్‌సిటీ అనే జిమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు యువతులు తృటిలో తప్పించుకున్నారు. జిమ్ పైన నిర్మించిన స్పా, సెలూన్‌లో కూడా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో స్పా అండ్ సెలూన్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువతులు మృతి చెందారు. యువతులిద్దరూ నాగాలాండ్ వాసులు.
గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిటీ లైట్ ఏరియాలోని సన్‌సిటీ అనే జిమ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిసేపటికే మంటలు ప్రమాదకర రూపం దాల్చాయి. జిమ్ పైన నిర్మించిన స్పా సెంటర్‌లో కూడా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో స్పా సెంటర్‌లో పనిచేస్తున్న ఇద్దరు యువతులు మృతి చెందారు. ఊపిరాడక యువతులిద్దరూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు యువతులు సకాలంలో బయటకు రాగా.. ఇద్దరు యువతులు బాత్‌రూమ్‌లో ఇరుక్కుపోయారు. మృతులు ఇద్దరూ నాగాలాండ్ వాసులుగా గుర్తించారు.
సమాచారం ప్రకారం బుధవారం సాయంత్రం సన్‌సిటీ జిమ్‌లో చాలా కార్యకలాపాలు జరిగాయి. ఒక్కసారిగా జిమ్ నుంచి పొగలు రావడంతో జిమ్ చేస్తున్నవారు బయటకు వచ్చారు. సన్‌సిటీ జిమ్ పైన స్పా, సెలూన్ సెంటర్ కూడా ఉంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. కొద్దిసేపటికే స్పా సెంటర్‌లోకి మంటలు వ్యాపించడంతో ఆ ప్రదేశం పొగతో నిండిపోయింది. మంటలను చూసి అక్కడ పనిచేస్తున్న యువతులు భయాందోళనకు గురై కేకలు వేశారు.
బాత్రూంలోకి వెళ్ళిన ఇద్దరు అమ్మాయిలు
ఈ సమయంలో ఇద్దరు యువతులు బాత్‌రూమ్‌లోకి వెళ్ళారు.. మరో ముగ్గురు అమ్మాయిలు ప్రాణాలను కాపాడుకోవడానికి దైర్యం చేసి బయటకు వచ్చారు. బాత్‌రూమ్‌లో ఉన్న ఇద్దరు యువతులు ఊపిరాడక మృతి చెందారు. ఈ ఇద్దరు యువతులు నాగాలాండ్ వాసులు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళం వెంటనే మంటలను అదుపు చేశారు. యువతులను రక్షించేందుకు స్పా సెంటర్‌లోకి ప్రవేశించింది.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు!
అగ్నిమాపక సిబ్బంది బాత్‌రూమ్‌లోకి వెళ్లేసరికి యువతులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే అగ్నిమాపక బృందం ఆ యువతులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న డీసీపీ సూరత్ విజయ్ గుర్జార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ హరీశ్ గధ్వి కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..