Simhachalam: సింహాచలం దేవాస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం.. వీహెచ్‌పి నిరసన

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం దేవాస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. దేవాలయ ఉద్యోగి మద్యం బాటిళ్లతో ఫోటోలు దిగడం వైరల్‌గా మారాయి. చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్‌పీ ఆందోళనకు దిగింది.

Simhachalam: సింహాచలం దేవాస్థానం పరిధిలో మద్యం బాటిళ్లు కలకలం.. వీహెచ్‌పి నిరసన
Simhachalam Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2024 | 7:27 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం. ఇక్కడ కొలువైన లక్ష్మీ నరసింహ స్వామీ.. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిగా పూజలను అందుకుంటున్నారు. అయితే స్వామివారి సన్నిధిలో అపచారం చోటుచేసుకుందంటూ విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సింహాచలం తొలిపావాంచా వద్ద వీహెచ్‌పి నిరసనకు దిగింది. దేవాలయ ఉద్యోగి మద్యం బాటిళ్లతో పోటోలు, వీడియోలు దిగారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వరల్‌ కావడంతో హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈవోకు వినతిపత్రం అందజేశారు. బాధ్యులైన సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

కొండ మీద దేవుడికి ప్రసాదాల పేరుతో వంటశాల ఏర్పాటు చేసి.. స్వంత వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పిళ్లళ్ల తాలుక సామాగ్రి వంటశాలలో పెట్టి, పెళ్లి పార్టీ వాళ్లను అక్కడ గదిలో కూర్చొబెట్టి మాట్లాడడం చేస్తున్నారని.. స్వామివారి వంటశాలను స్వంత ఆఫీసుగా వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మంతా సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై సమగ్ర ఎంక్వైరీ జరపాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది. బాధ్యులైన సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..