అక్రమ సంబంధంతో పుట్టిందని అప్పుడే పుట్టిన పిల్లను గోతిలో పాతిపెట్టిన ప్రియుడు ప్రియురాలు..

రోజుకీ రోజుకీ మనిషిలోని మానవత్వం మాయం అవుతుంది. క్షణ కాల సంతోషం చేసే పనులు జీవితకాలానికి శిక్షగా మారతాయని మరచిపోతున్నారు. మృగంగా మారుతున్నారు. తాజాగా బురదలో ఉన్న అప్పుడే పుట్టిన నవ జాత శిశివుని స్థానికులు చూశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలికను ఆ గోతి నుంచి బయటకు తీశారు. బతికి ఉండడంతో చిన్నారిని ఆస్పత్రికి చేర్చి.. పాప తల్లిదండ్రుల కోసం వేదితకారు. బాలిక అక్రమ సంబంధం కారణంగా పుట్టిందని ప్రియుడు, ప్రియురాలు..చిన్నారిని గొయ్యిలో పూడ్చి చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

అక్రమ సంబంధంతో పుట్టిందని అప్పుడే పుట్టిన పిల్లను గోతిలో పాతిపెట్టిన ప్రియుడు ప్రియురాలు..
Newborn
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2024 | 8:56 AM

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంభాల్‌లోని పొలంలోని బురద గుంట మధ్యలో ఓ నవజాత బాలిక పడి ఉంది. ఈ విషయాన్నీ అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు సంభాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ చిన్నారిని మట్టి నుంచి వెలుపలకు తీశారు. అప్పుడే పుట్టిన ఆడపిల్లగా గుర్తించారు. ఆ చిన్నారికి భూమి మీద నూకలు ఉండడంతో ఇంత జరిగినా బతికే ఉంది. దీంతో చిన్నారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బాలికను చంపాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారిని సకలంలో చూడడంతో రక్షించబడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. దీంతో అప్పుడే పుట్టిన బాలిక తల్లిదండ్రులను కనిపెట్టారు.

పాపను రక్షించి ఆస్పత్రికి తరలించిన తర్వాత పోలీసులు ఆ చిన్నారి తల్లి కోసం వెదికారు. ఈ కేసు నఖాసా పోలీస్ స్టేషన్‌లోని మన్నిఖేడా గ్రామానికి చెందినది. అక్కడ పొలంలోని బురదలో పాతిపెట్టిన నవజాత బాలికను రక్షించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆ ప్రాంతంలోని ఆశా వర్కర్ల ద్వారా గర్భిణుల సమాచారం తెలుసుకున్నారు.

ప్రియుడు, ప్రియురాలు అరెస్టు

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఈ గ్రామంలో ఓ యువకుడికి, మహిళకు మధ్య అక్రమ సంబంధంతో ఆడపిల్ల పుట్టిందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు విచారించగా.. తమ పరువు పోకుండా ఉండేందుకు ప్రేమికుడు, ప్రియురాలు .. పుట్టిన పిల్లను హత్య చేసేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే పొలంలో మట్టితో పూడ్చిపెట్టినట్లు షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమజంట పరువు పోతుందని బాలికను చంపేందుకు ప్రయత్నించారు. ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలిక పరిస్థితి ఎలా ఉందంటే

చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అప్పుడే పుట్టిన పసికందు కళ్లు, ముక్కులో బురద చేరుకుందని.. శుభ్రం చేశామని జిల్లా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో వైద్యురాలు డాక్టర్ దీప్శిఖ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..