బాలీవుడ్ ‘రామాయణ’పై అఫీషియల్ అప్‌డేట్
బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ దీన్ని రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రెండు పార్టులుగా ఇది రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీలను తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది.
2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదలకానున్నట్లు వెల్లడించింది. కొన్ని నెలలుగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. ఇక ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కనిపించనున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఈ పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్నానని, డైట్ ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. మద్యపానం మానేసినట్లు తెలిపారు. సీత పాత్రలో నటించడం తన అదృష్టమని సాయిపల్లవి తెలిపారు. ‘‘చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథల్లో రామాయణం ఒకటి. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం రావడం నా భాగ్యం. భయాన్ని పక్కనపెట్టి.. సీతమ్మగా మారాలని నిర్ణయించుకున్నా. నటిగా కాకుండా భక్తురాలిగా ఆ రోల్ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు. రావణుడిగా యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
49 ఏళ్ళకి పెళ్ళికి సిద్ధమైన టాప్ హీరోయిన్
అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం
కోల్‌కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

