49 ఏళ్ళకి పెళ్ళికి సిద్ధమైన టాప్ హీరోయిన్
ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్ ఆమె. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో విపరీతమైన క్రేజ్ తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ అమ్మడు కురాళ్లను తన అందంతో కవ్వించింది. సినీ ఇండస్ట్రీలో బ్రహ్మచారులుగా ఉన్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది పెళ్లితో పనేంటి అని అంటుంటే మరికొంతమంది మాత్రం పెళ్ళికి ఇంకా టైం ఉంది అని తప్పించుకుంటున్నారు.
మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోని హీరోయిన్లు కొంతమంది ఉంటే మరికొంతమంది నాలుగు పదుల వయసు వచ్చినా అలానే ఉన్నారు. అలాంటి వారిలో ఓ భామ ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా 49 ఏళ్ల వయసులో ఆమె పెళ్ళికి రెడీ అయ్యిందని అంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించడమే కాకుండా… కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా.. ముగ్గురు స్టార్ హీరోలతో అలాగే ఓ క్రికెటర్ తో ఎఫైర్ పెట్టుకుందని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇంతకూ ఆమె ఎవరంటే.. హీరోయిన్ నగ్మా. 1991లో పెద్దింటల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నగ్మా. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన కిల్లర్ సినిమాతో హిట్ అందుకుంది. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయినా గా ఛాన్స్ అందుకుంది. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది నగ్మా. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. అదే సమయంలో నగ్మా లవ్ ఎఫైర్స్ వార్తలు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం సాగించిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతకు ముందు శరత్ కుమార్, రేసుగుర్రం విలన్ రవికిషన్, అలాగే మరో హీరోతో కూడా లవ్ స్టోరీ నడిపిందని రూమర్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ అమ్మడు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంది. ఇప్పుడు నగ్మా పెళ్ళికి రెడీ అయ్యిందంటున్నారు. 49 ఏళ్ల వయసులో నగ్మా పెళ్ళికి రెడీ అవుతున్నా.. ఆమె అభిమానులు మాత్రం సంతోషపడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్.. కేరళ సర్కారు కీలక నిర్ణయం
కోల్‌కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది
Kanguva: కంగువ విడుదల డౌటేనా ??
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

