Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

ToxicPanda: ఆండ్రాయిడ్ వినియోగదారులపై మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. మీరు కూడా ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే, మీరు ఏ తప్పులు చేయకుండా ఉండాలో తెలుసుకోండి. ఈ ప్రమాదం వల్ల మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు..

Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!
Follow us

|

Updated on: Nov 07, 2024 | 2:14 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులకు పెను ముప్పు పొంచి ఉంది. ఆండ్రాయిడ్ పరికరాల్లో కొత్త మాల్వేర్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ ముప్పు పేరు టాక్సిక్ పాండా. ఈ కొత్త మాల్వేర్ డివైజ్‌లలోకి ఎలా ప్రవేశిస్తుంది? ఇది ఎలా హాని కలిగిస్తుంది ? ఈ ప్రమాదకరమైన మాల్వేర్‌ను ఎలా నివారించవచ్చు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మాల్వేర్ బ్యాంకింగ్ యాప్, Google Chrome రూపంలో మొబైల్‌లలో ప్రవేశిస్తుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లీఫీ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం ఈ మాల్వేర్‌ను గుర్తించింది. ఈ మాల్వేర్ డివైజ్‌లలోకి ప్రవేశించడం ద్వారా బ్యాంకింగ్ భద్రతకు ముప్పు ఉంటుంది. ఆపై వినియోగదారు బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.

ఈ మాల్వేర్ మరింత ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ మాల్వేర్ ద్వారా రిమోట్ హ్యాకర్లు మీ మొబైల్‌ను ఎక్కడి నుండైనా నియంత్రించవచ్చు. టాక్సిక్ పాండా మాల్వేర్‌ని గుర్తించడం కష్టం. ఎందుకంటే సాధారణ మన మొబైల్‌లలో ఉండే యాప్‌ మాదిరిగా కనిపిస్తుంది. TgToxic అనే మాల్వేర్ నుంచి టాక్సిక్ పాండా వచ్చింది. ఈ కొత్త మాల్వేర్ దృష్టి ఆర్థిక నష్టాన్ని కలిగించడమే. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను హ్యాక్ చేసి, ఫోన్‌లో వచ్చిన ఓటీపీని యాక్సెస్ చేసే విధంగా ఈ మాల్వేర్ రూపొందించారు హ్యాకర్లు.

ఇలా ToxicPanda ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది!

మీరు గూగుల్ ప్లే లేదా గెలాక్సీ స్టోర్ వంటి అధికారిక యాప్ స్టోర్‌లను వదిలి థర్డ్ పార్టీ సైట్‌ల ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు టాక్సిక్ పాండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి ప్రవేశిస్తుందని పరిశోధకులు తెలిపారు. టాక్సిక్ పాండాను ఎవరు అభివృద్ధి చేశారనే దానిపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే దీనిని హాంకాంగ్‌లో అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.

ఈ మాల్వేర్‌ను ఎలా నివారించాలి?

మీరు మిమ్మల్ని, మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే Google Play Store లేదా Galaxy Story కాకుండా మరెక్కడా యాప్‌ని పొరపాటున డౌన్‌లోడ్ చేసుకోకండి. తెలియని థర్డ్ పార్టీ సైట్‌ల ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల మీ మొబైల్‌పై మాల్వేర్ దాడి జరిగే ప్రమాదం పెరుగుతుంది. ఒకవేళ కంపెనీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రూపొందించినట్లయితే, ఖచ్చితంగా ఫోన్‌ను అప్‌డేట్ చేయండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి