Hidden Camera Detector: హోటల్‌ గదులలో సిక్రెట్‌ కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసా?

Spy Camera: చాలా మంది టూర్‌ వెళ్లిన తర్వాత హోటల్‌, లాడ్జిలలో బస చేస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడ సిక్రెట్‌ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. ఎవ్వరు కూడా కనిపెట్టకుండా ఉండే కెమెరాలను అమరుస్తుంటారు. అలాంటప్పుడు మీ గదిలో కెమెరాలను సులభంగా గుర్తించవచ్చు.. అలాగంటే..

Hidden Camera Detector: హోటల్‌ గదులలో సిక్రెట్‌ కెమెరాలను ఎలా గుర్తించాలో తెలుసా?
Follow us

|

Updated on: Nov 07, 2024 | 2:43 PM

Spy Camera: మీరు టూర్ కోసం ఏదైనా ఇతర నగరానికి వెళ్లినప్పుడు బస చేయడానికి మీకు ఖచ్చితంగా హోటల్ గది అవసరం. హోటల్‌లో బస చేసే ముందు బస చేయబోయే గదిలో రహస్య కెమెరా ఉంటే? చాలా మంది తమ ప్రైవేట్ మూమెంట్స్ లీక్ అవుతాయని భయపడుతుంటారు. ఈ భయం ఎక్కువగా జంటలలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు స్పై కెమెరాను క్యాప్చర్ చేయగల డివైజ్‌ ఉండటం చాలా ముఖ్యం. మీరు హోటల్‌లో గదిని కూడా బుక్ చేసి ఉంటే, హోటల్ కెమెరాలో ఏదైనా రహస్య కెమెరా ఉందో లేదో మీరు ఎలా కనుగొనాలి? ఎవరూ సులభంగా చూడలేని ప్రదేశంలో రహస్య కెమెరాను అమరుస్తుంటారు. గదిలోని ప్రతి మూలను జాగ్రత్తగా తనిఖీ చేయండి. కెమెరా ఏదైనా గుర్తించని ప్రదేశంలో ఉండవచ్చు. మరి అలాంటి సిక్రెట్‌ కెమెరాను గుర్తించడం ఎలా?

లైట్లు ఆఫ్ చేయండి:

గదిలోకి వెళ్లిన తర్వాత లైట్లను స్విచ్ ఆఫ్ చేసి, ఎరుపు లైట్లు ఏమైనా కనిపిస్తాయో లేదో జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఏదైనా రెడ్ లైట్ కనిపిస్తే అది కెమెరా కూడా కావచ్చు.

కెమెరా డిటెక్టర్

సిక్రెట్‌ కెమెరాలను కనుగొనడంలో మీకు సహాయపడే పరికరం ఉంది. మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎక్కడి నుండైనా కెమెరా డిటెక్టర్‌ని కొనుగోలు చేయవచ్చు. మీరు రూ. 3,000 నుండి రూ. 8,000 వరకు ఆన్‌లైన్ కెమెరా డిటెక్టర్‌లను కొనుగోలు చేయవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు హోటల్ గదిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా అనుమానం వస్తే అది కెమెరా అని భావించాలి. వెంటనే ఆ విషయాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయండి. వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు లేదా బట్టలు మార్చుకునేటప్పుడు గోప్యతను కాపాడుకోవడానికి, మీరు గదిలోని కర్టెన్‌లను క్లోజ్‌ చేసుకోండి.

Hidden Camera Detector1

Hidden Camera Detector1

మీ వద్ద కెమెరా డిటెక్టర్‌ ఉంటే ముందుగా దానిని ఆన్‌ చేయాలి. ఆపై ఈ డిటెక్టర్‌లో ఇన్‌స్టాల్ చేసిన పవర్‌ఫుల్‌ లేజర్ లెన్స్ సిక్రెట్‌, పిన్‌హోల్ కెమెరాలను కూడా గుర్తిస్తుంది. ఈ డిటెక్టర్ ఇంటెన్సిటీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిటెక్టర్‌ కెమెరా వద్దకు తీసుకురాగానే అందులో మెరుస్తుంది. ఈ డిటెక్టర్ల వల్ల సిక్రెట్‌ కెమెరాలను సులభంగా గుర్తించవచ్చు.

ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్‌ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్‌!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి