AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: ఇప్పుడు టార్గెట్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షాకు హత్య బెదిరింపులు..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తర్వాత షారుక్ ఖాన్ కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరింపులు రావడంతో షారూఖ్ ఖాన్ బృందం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. షారుఖ్‌కు బెదిరింపులు వచ్చిన ఫోన్ ఫైజాన్ పేరు మీద రిజిస్టర్ చేయబడింది.

Shah Rukh Khan: ఇప్పుడు టార్గెట్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్ షాకు హత్య బెదిరింపులు..
Shah Rukh Khan
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 2:59 PM

Share

గత కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను హత్య చేస్తామని ఇప్పటికే పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబీ సింగర్ సిద్ధుమూసేవాలా హత్య తర్వాత కొన్ని రోజులపాటు సైలెంట్ అయిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఇప్పుడు మరింత యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది. దసరా పండగ రోజున సల్మాన్ సన్నిహితుడు ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య వెనుక తమ ప్రమేయం ఉందంటూ బిష్ణోయ్ గ్యాంగ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సల్మా్న్ ఖాన్‏కు మరింత భద్రత ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు హత్య బెదిరింపులు వచ్చాయి. దీనిపై షారుఖ్ బృందం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

షారుఖ్‌కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ ఫైజాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయబడిందని రాయ్‌పూర్‌లో అతడి చివరిసారిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర పోలీసు బృందం రాయ్‌పూర్‌కు చేరుకుంది. ఫైజాన్ ఖాన్ అనే యువకుడి కోసం మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

నవంబర్ 5, ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో షారుఖ్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపులపై ఫిర్యాదు నమోదైంది. నవంబర్ 5వ తేదీ రాత్రి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. ఎదురుగా ఉన్న వ్యక్తి పేరు అడగ్గా నేనెవరు.. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనేది అనవసం. పేరు కావాలంటే హిందుస్తానీ అని రాయండి అని కానిస్టేబుల్ కు చెప్పడంత అతడు ఈ విషయాన్ని తన సీనియర్ అధికారులకు చెప్పాడు. షారుఖ్ టీమ్ ఇచ్చి ఫిర్యాదుతో ఈ కేసుపై విచారణ వేగవంతం అయ్యింది. ఈ విషయంలో షారుఖ్ ఖాన్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.