- Telugu News Photo Gallery Cinema photos Actress nabha natesh latest glamour photos goes viral on instagram
Nabha Natesh: అందాలతో గాలాలు వేస్తోన్న కుర్ర బ్యూటీ.. కానీ అవకాశాలు మాత్రం ఆమడ దూరం
డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమాలేమీ హిట్ కాలేదు.
Updated on: Nov 07, 2024 | 1:55 PM

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే క్లిక్ అయిన హీరోయిన్ నభా నటేష్. 2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ నభా నటేష్.

అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందీ అందాల తార. ఇస్మార్ట్ శంకర్ తన అందం నటనతో ఆకట్టుకుంది.

ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆ సినిమాలేమీ హిట్ కాలేదు.

దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ చేసింది. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోతోంది.

చివరిగా డార్లింగ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. ఆఫర్స్ అందుకోవడంలో వెనకబడిన అందాలతో అభిమానులను కవ్వించడంలో మాత్రం ఈ భామ తోపే..




