AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: సొంతంగా ప్రైవేట్ జెట్, పడవ.. కమల్ హాసన్ ఆస్తులు తెలిస్తే మెంటలెక్కాల్సిందే..

తమిళ చిత్రపరిశ్రమలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కమల్ హాసన్. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈరోజు కమల్ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.

Kamal Haasan: సొంతంగా ప్రైవేట్ జెట్, పడవ.. కమల్ హాసన్ ఆస్తులు తెలిస్తే మెంటలెక్కాల్సిందే..
Kamal Haasan
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 3:20 PM

Share

తమిళ చిత్ర పరిశ్రమలో భారీ సామ్రాజ్యాన్ని సృష్టించిన లోకనాయకుడు కమల్ హాసన్. బాలనటుడిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన కమల్.. దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిజం సినిమాలే కాకుండా విభిన్నమైన కంటెంట్ తరహా చిత్రాలను ఎంచుకుంటూ నటుడిగా అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన కమల్.. ఇప్పటికీ నటుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈహీరో.. ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. కానీ అంతకు ముందు వచ్చిన ఇండియన్ 2 మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే.. ఈరోజు కమల్ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే కమల్ అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కమల్ ఆస్తులు, కార్లు, లైఫ్ స్టైల్ గురించి తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. కమల్ కు సొంతంగా రాజ్ కమల్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. కమల్ హాసన్ నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, రాజకీయ నాయకుడు. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తెలుగులో మంచి డిమాండ్ ఉన్న నటుడు కమల్. నివేదికల ప్రకారం ఆయన ఆస్తి రూ.584 కోట్లు. కమల్ హాసన్ చాలా బ్రాండ్లకు ప్రచార అంబాసిడర్.

కమల్ హాసన్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. అతనికి చెన్నైలో ఇల్లు, మరికొన్ని ప్లాట్లు ఉన్నాయి. చెన్నైలో ఆయనకున్న ఆస్తుల మొత్తం విలువ రూ.92.5 కోట్లు. అలాగే లండన్ లోనూ సొంతంగా ఇల్లు కలిగి ఉన్నాడు. కమల్ హాసన్ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. అతని వద్ద BMW 730 LT, Lexus LX 570 కార్లు ఉన్నాయి. అలాగే సొంతం ఫ్లైట్ జెట్, బోట్ కూడా ఉన్నాయి. కమల్ హాసన్ ఒక్కో సినిమాకు 25-30 కోట్లు తీసుకుంటాడు. ‘విక్రమ్‌’ సినిమాకు 50 కోట్లు అందుకున్నాడు. ‘ఇండియన్ 2’ సినిమాకు 150 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.