AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rami Reddy: విలన్‏గా అల్లాడించేశాడు.. ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ఒకప్పుడు ఆయన పేరు చెబితే అడియన్స్ భయంతో వణికిపోయేవారు. అంకుశం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అయన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. కానీ చివరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

Rami Reddy: విలన్‏గా అల్లాడించేశాడు.. ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Rami Reddy
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 3:41 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు విలన్ అంటే జనాలు దడుసుకునేవాళ్లు. స్క్రీన్ పైనే కాదు.. బయట కనిపించినా ప్రేక్షకులు భయంతో వణికిపోయేవారు. అంతగా తమ నటనతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు కొందరు నటులు. అందులో రామి రెడ్డి ఒకరు. ఈతరం ప్రేక్షకులకు ఆయన గురించి అంతగా తెలియదు. కానీ 90వ దశకంలో మాత్రం ఆయన పేరు వినని సినీప్రియులు ఉండరు. అంకుశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రామిరెడ్డి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అంకుశం చిత్రంలో విలన్ పాత్రలో ఒదిగిపోయారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయనకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, భోజ్ పురి భాషలలో నటించి తన మార్క్ చూపించారు.

250కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు రామిరెడ్డి. ఆయన చివరి చిత్రం మర్మం. అయితే వెండితెరపై ఆయన ఎక్కువగా విలన్ పాత్రలే పోషించారు. తెలుగులో పెద్దరికం, అనగనగాఒక రోజు వంటి చిత్రాల్లోనూ నటించారు. విజయశాంతి నటించిన అడవి చుక్క, నాగ ప్రతిష్ట, తెలుగోడు సినిమాలు ఆయనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టాయి. చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా దూసుకుపోతున్న సమయంలోనే అనుకోని సమస్య అతడిని వెంటాడింది. కాలేయ సంబంధ వ్యాధితో 55 ఏళ్ల వయసులోనే 2011లో కన్నుమూశారు.

కాలేయ వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. గుర్తుపట్టలేనంతగా సన్నగా మారిపోయారు. చాలా రోజులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారు. రామిరెడ్డి చిత్తూరు జిన్నా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా తీసుకున్న ఆయన మొదట్లో ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నటుడు, జర్నలిస్ట్ మాత్రమే కాదు బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. నటుడిగా ప్రేక్షకులను అలరించిన రామిరెడ్డి చివరి రోజుల్లో మాత్రం కాలేయ సమస్యతో నరకం అనుభవించారట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.