AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arundhati: ఓడియమ్మా.. అరుంధతి సినిమా కోసం సోనూసూద్ అంత డిమాండ్ చేశాడా.. ? రోజుకు ఎంతంటే..

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుష్క పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోయిన్‏కు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే అనుష్కకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్, కొత్త సినిమాల అప్డే్ట్స్ తెగ షేర్ చేస్తున్నారు.

Arundhati: ఓడియమ్మా.. అరుంధతి సినిమా కోసం సోనూసూద్ అంత డిమాండ్ చేశాడా.. ? రోజుకు ఎంతంటే..
Arundhati
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 4:34 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పేరు స్వీటీ శెట్టి. కానీ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆ తర్వాత అనుష్కగా పేరు మార్చుకుంది. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. ఆ తర్వాత అరుంధతి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన అనుష్క అద్భుతమైన నటనకు సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇక ఇందులో విలన్ పాత్రలో సోనూ సూద్ అదరగొట్టేశాడు. ఇప్పటికీ ఈ సినిమా ప్రసారమయితే టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఇక ఈ సినిమాతో గద్వాల్ కోట కూడా అంతే ఫేమస్ అయ్యింది. కంటెంట్, పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీలో ప్రేతాత్మగా అల్లాడించేశాడు సోనూసూద్.

అరుంధతి సినిమా తర్వాత సోనూ సూద్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. విలన్ పాత్ర అయినప్పటికీ ఈ సినిమాతో అటు అనుష్కతోపాటు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూసూద్. ఇక ఈ సినిమా కోసం అతడు తీసుకున్న రెమ్యునరేషన్ తెలిసి షాకవుతున్నారు అడియన్స్. ఈ సినిమాలో సోనూ సూద్ నటన అద్భుతమనే చెప్పాలి. పశుపతి పాత్రలో ప్రేక్షకులను గడగడలాడించాడు. “బొమ్మాళి.. పిందె పండయిందిగా..నిన్ను వదల బొమ్మాళి” అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్.

ఈ సినిమా కోసం సోనూసూద్ మొత్తం 20 రోజుల షూటింగ్ కు దాదాపు 18 లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. అయితే 20 రోజులకు మించి ఒక్కరోజు షూటింగ్ జరిగినా.. ఒక్కో రోజుకు దాదాపు రూ.25 వేలు ఇస్తానని నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారట. అరుంధతి సినిమా మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరిగిందట. సోనూసూద్, అనుష్క మధ్య వచ్చే సీన్స్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరగడంతో సోనూ సూద్ కు మొత్తం రూ.45 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇప్పుడు ఈ విషయం తెలిసి షాకవుతున్నారు సినీ ప్రియులు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.