AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మా హీరోకు రానా, తేజ క్షమాపణ చెప్పాల్సిందే.. మహేష్ ఫ్యాన్స్ డిమాండ్.. ఎందుకంటే..

సాధారణంగా సంక్రాంతికి తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు పోటిపడుతుంటాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలు జనాలను ఆకట్టుకుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుంటాయి. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా అడియన్స్ ముందుకు రావడం సహజమే.

Mahesh Babu: మా హీరోకు రానా, తేజ క్షమాపణ చెప్పాల్సిందే.. మహేష్ ఫ్యాన్స్ డిమాండ్.. ఎందుకంటే..
Rana, Teja Sajja, Mahesh Ba
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2024 | 5:11 PM

Share

యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. బాలనటుడిగా ఇన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతడు.. ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఇటీవల హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నాడు. ఈ ఏడాదికి సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా విడుదలయ్యింది. అటు తేజా సజ్జా హనుమాన్… ఇటు మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాలు పోటాపోటీగా బరిలోకి దిగాయి. కానీ ఇందులో హనుమాన్ సినిమా భారీ వసూళ్లూ రాబట్టింది. అయితే ఆ సమయంలో థియేటర్ల కేటాయింపుపై నెట్టింట పెద్ద చర్చే జరిగింది.

ఇదంతా పక్కన పెడింతే.. ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా, హీరో రానా దగ్గుబాటిపై మహేష్ బాబు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం ఇటీవల వీరిద్దరు ఐఫా వేడుకలలో చేసిన వ్యాఖ్యలే. కొన్ని రోజుల క్రితం జరిగిన ఐఫా వేడుకలలో తేజ సజ్జా, మహేష్ ఇద్దరిని పోలుస్తూ హీరో రానా చేసిన కామెంట్స్ ఇప్పుడు మహేష్ అభిమానుల కోపానికి కారణం. సంక్రాంతికి విడుదలైన సినిమాల గురించి మాట్లాడుతూ సరదాగా మాట్లాడాడు రానా. కానీ తమ హీరోను తేజా సజ్జాతో పోల్చడం నచ్చలేదని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

దుబాయ్ వేడుకగా జరిగిన ఐఫా వేడుకలో రానా మాట్లాడుతూ.. “ఇతడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. వివాదాలకు దూరంగా ఉన్నాడు. చాలా మృదుస్వభావి.. కోట్లాది మంది హృదయాలను కదిలించేవాడు. లవర్ బాయ్, యాక్షన్ స్టార్.. వన్ అండ్ ఓన్లీ..” అంటూ మాట్లాడుతుండగానే.. “ఇప్పుడు నా గురించి ఎందుకు బ్రో” అంటూ సిగ్గుపడిపోయాడు తేజా. దీంతో రానా “నేను నీ గురించి కాదు మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నాను.. తేజ, మహేష్ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చారు. ఇద్దరూ ఒకే ప్రయాణాన్ని ఎంచుకున్నారు. అతడు ఒక సూపర్ స్టార్.. మీరు ఒక సూపర్ స్టార్.. మీరిద్దరూ సంక్రాంతికి వచ్చారు” అని అన్నారు రానా. సంక్రాంతి విషయం పక్కన పెట్టండి అంటూ తేజ్ రిక్వెస్ట్ చేయగా.. ఇది ఎందుకు సెన్సిటివ్ టాపిక్ అంటూ ఆటపట్టించారు రానా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా.. మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీరు ఒక్క సినిమా హిట్టు కొట్టారు.. కానీ మహేష్ 25 ఏళ్లుగా సూపర్ హిట్స్ అందుకుంటుననారు. హనుమాన్‌కి సీక్వెల్‌ తీస్తే తప్ప మహేష్‌ కలెక్షన్స్‌తో సరిపెట్టుకోలేం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజ సజ్జా, రానా మహేష్ బాబుకు సారీ చెప్పాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

ట్వీట్స్.. 

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?