Tax Evasion: అధికారుల మైండ్‌బ్లాంక్‌..18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!

Tax Evasion: ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 31 వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో జీఎస్టీలో నమోదైన దాదాపు 18,000 నకిలీ కంపెనీలను గుర్తించారు. ఈ నకిలీ రికార్డుల నుంచి 25,000 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. గతేడాది కూడా జీఎస్టీ మోసగాళ్లను గుర్తించేందుకు జీఎస్టీ విభాగం తొలిసారిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది..

Tax Evasion: అధికారుల మైండ్‌బ్లాంక్‌..18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 07, 2024 | 3:04 PM

అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం పలు చట్టాలను రూపొందించనుంది. అయితే, మోసగాళ్లు రకరకాల మార్గాలలో మోసాలకు పాల్పడుతున్నారు. జీఎస్టీ కింద నమోదైన కంపెనీల్లో చాలా నకిలీ భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. జీఎస్టీ అధికారులు 18,000 నకిలీ కంపెనీలను (GST నకిలీ రిజిస్ట్రేషన్) గుర్తించారు. ఈ నకిలీ కంపెనీల ద్వారా రూ.25,000 కోట్ల పన్ను ఎగవేత కూడా వెలుగులోకి వచ్చింది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై కన్నేసిన అధికారులు:

దేశవ్యాప్తంగా పలు కంపెనీలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్న అనుమానంతో జీఎస్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి వస్తువులను విక్రయించనప్పటికీ 73,000 కంపెనీలు ఐటీసీని ఉపయోగిస్తున్నాయని జీఎస్టీ విభాగం అనుమానం వ్యక్తం చేసింది. వీటిని తనిఖీ చేయగా 18,000 కంపెనీలు నకిలీవని తేలింది. వాడుకలో లేని కంపెనీల పేర్లను ఉపయోగించి రూ.24,550 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు జీఎస్టీ అధికారులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Jio Plan: జియో చౌకైన ప్లాన్‌.. రూ.175తో 10 జీబీ డేటా, 11 ఓటీటీ యాప్స్‌!

నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్:

నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం చాలా వరకు పోతుంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ మొదటి ఆపరేషన్ మే 16 నుండి జూలై 15, 2023 వరకు జరిగింది. అప్పట్లో జీఎస్టీ కింద నమోదైన 21,791 నకిలీ కంపెనీలను గుర్తించారు. 24,010 కోట్ల పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చింది. రెండవ జీఎస్టీ ఆపరేషన్ ఆగస్టు 16 నుండి అక్టోబర్ 31, 2024 వరకు నిర్వహిస్తోంది. ఈ రెండో స్పెషల్ డ్రైవ్‌లో ఇంకా ఎక్కువ పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి