AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trump Net Worth: ట్రంప్ ఎంత ధనవంతుడో తెలుసా? భారత్‌లో కూడా పెట్టుబడి పెట్టాడా?

Trump Net Worth: ట్రంప్ వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అతని తండ్రి ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్ అత్యంత విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకటిగా పేరుంది. డొనాల్డ్ ట్రంప్ 1971లో తన తండ్రి నుంచి వచ్చిన

Trump Net Worth: ట్రంప్ ఎంత ధనవంతుడో తెలుసా? భారత్‌లో కూడా పెట్టుబడి పెట్టాడా?
Subhash Goud
|

Updated on: Nov 06, 2024 | 5:29 PM

Share

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చారు. రెండు సారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థి అభ్యర్థి కమలా హారిస్‌పై ఆధిక్యం సాధించారు. అమెరికా సంపన్న నాయకుల్లో ట్రంప్‌ పేరుంది. ట్రంప్ వ్యాపారం రియల్ ఎస్టేట్ నుండి మీడియా టెక్నాలజీ వరకు విస్తరించింది. ట్రంప్‌ భారత్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. ట్రంప్ మొత్తం సంపద ఎంత అనేది తెలుసుకుందాం.

డొనాల్డ్ ట్రంప్ ఎంత ధనవంతుడు?

డొనాల్డ్ ట్రంప్ 2016లో తొలిసారిగా తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ సమయంలో అతని సంపద 4.5 బిలియన్ డాలర్లు. అయితే అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన సంపద క్షీణించింది. ఇది 2020లో $2.1 బిలియన్లకు తగ్గింది. కానీ, ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ట్రంప్ సంపదలో పెరుగుదల కనిపించింది. అతని నికర విలువ 2022 నాటికి $3 బిలియన్లకు చేరుకుంటుంది. అదే సమయంలో నవంబర్ 2024 నాటికి ఇది 7 బిలియన్ డాలర్లను దాటింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. నవంబర్ 2024లో ట్రంప్ నికర విలువ 7.7 బిలియన్ డాలర్లు. రూపాయిల్లో చూస్తే దాదాపు 64,855 కోట్లు.

ట్రంప్ సంపద రహస్యం:

డొనాల్డ్ ట్రంప్ నికర విలువలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అత్యధిక వాటాను కలిగి ఉన్నారు. ఎన్నికల రోజునే అంటే నవంబర్ 5న ట్రంప్ మీడియా షేర్లలో దాదాపు 15 శాతం భారీ జంప్ జరిగింది. అతనికి 19 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ట్రంప్ ప్రభావం కనిపిస్తోంది.

వారసత్వ సంపద

ట్రంప్ వారసత్వంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అతని తండ్రి ఫ్రెడ్ ట్రంప్ న్యూయార్క్ అత్యంత విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలలో ఒకటిగా పేరుంది. డొనాల్డ్ ట్రంప్ 1971లో తన తండ్రి నుంచి వచ్చిన $413 మిలియన్ల వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుని వేగంగా విస్తరించారు. ఎన్నో విలాసవంతమైన భవనాలను నిర్మించాడు. వీటిలో ట్రంప్ ప్యాలెస్, ట్రంప్ వరల్డ్ టవర్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, రిసార్ట్ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని పెద్ద నగరాలతో పాటు, ట్రంప్ టవర్ భారతదేశంలోని ముంబైలో కూడా ఉంది.

ఇది కూడా చదవండి: US President Salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా? ఇంకా బెనిఫిట్స్‌ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు!

భారత్‌లో ట్రంప్‌ పెట్టుబడులు

డొనాల్డ్ ట్రంప్‌కు భారతదేశంలో కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటివరకు, పుణె, ముంబైలలో ఉన్న రెండు ట్రంప్ టవర్లు భారతదేశంలో పూర్తయ్యాయి. అదే సమయంలో గురుగ్రామ్, కోల్‌కతాలో మరో రెండు ట్రంప్ టవర్లను నిర్మిస్తున్నారు. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కనీసం నాలుగు టవర్ల కోసం ప్రణాళికలు పని చేస్తున్నాయి. ఇది ట్రంప్ బ్రాండ్ కోసం భారతదేశాన్ని అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటిగా చేస్తుంది.

ఫోర్బ్స్ ప్రకారం, మే 2024 నాటికి ట్రంప్ మొత్తం నికర విలువ:

  • ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్: $5.6 బిలియన్
  • రియల్ ఎస్టేట్: $1.1 బిలియన్
  • గోల్ఫ్ క్లబ్‌లు, రిసార్ట్స్: $810 మిలియన్లు
  • నగదు, ఇతర ఆస్తులు: $510 మిలియన్
  • ఇతర ఆస్తులు: $540 మిలియన్లు

ట్రంప్ రాజభవనం

డొనాల్డ్ ట్రంప్‌కు అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అతను ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఒడ్డున $10 మిలియన్ల విలువైన అందమైన భవనం ఉంది.వైట్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ ఫ్లోరిడాలోని ఈ భవనంలో నివసిస్తున్నారు. దీనిని 1927లో నిర్మించగా, 1985లో ట్రంప్ కొనుగోలు చేశారు. ఇది 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 58 బెడ్‌రూమ్‌లు, 33 బాత్‌రూమ్‌లు, 12 ఫైర్‌ప్లేస్‌లు, స్పా, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్‌లు, గోల్ఫ్ కోర్స్ ఉన్నాయి.

విమానాలు:

డొనాల్డ్‌ ట్రంప్‌కు విమానాలు, కార్ల సేకరణ కూడా ఆయన సంపదకు నిదర్శనం. ట్రంప్ వద్ద 5 విమానాలు ఉన్నాయి. అదే సమయంలో అతని కార్ సేకరణలో రోల్స్ రాయిస్ రాయల్ సిల్వర్ క్లౌడ్ నుండి మెర్సిడెస్ బెంజ్ వరకు వందల కొద్దీ లగ్జరీ వాహనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి