UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రోజుకు రూ. లక్ష..

యూపీఐ సేవలను ఉపయోగిస్తున్న ఎన్నైరైల కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నైరైలు తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా రోజుకు రూ. లక్ష పంపించుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ మొబైల్‌ నెంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు..

UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రోజుకు రూ. లక్ష..
Upi
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2024 | 2:20 PM

యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగిపోయి. చిన్న చిన్న టీ దుకాణాలు మొదలు, పెద్ద దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్‌ స్వీకరిస్తున్నారు. విదేశాల్లో ఉండే భారతీయులు సైతం తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ), నాన్‌ రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు పంపించుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో యూజర్లు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించుకోవచ్చు. అంతర్జాతీయ మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించుకోవచ్చు.

ఈ సదుపాయాన్ని యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు అవకాశం కల్పించారు. ఈ కొత్త సదుపాయంతో రోజుకు రూ. 1 లక్ష పంపించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్, ఇండస్‌ఇండ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్‌ బ్యాంక్, డీబీఎస్‌ బ్యాంక్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, నేషనల్‌ బ్యాంక్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకులు అమలు చేస్తున్నాయి.

అంతర్జాతీయ మొబైల్ నెంబర్లకు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం, భీమ్, భీమ్‌ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్‌ ఇండస్‌ పే, ఎస్‌ఐబీ మిర్రర్‌ ప్లస్ వంటి పేపేంట్‌ యాప్స్‌ వంటివి సపోర్ట్‌ చేస్తాయి. ఎన్నారైలు తమ ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో ఖాతాల మధ్య అలాగే.. భారత్‌లోని ఖాతాలకు యూపీఐ లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఎన్‌ఆర్‌వో ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఈ ఖాతాకు నిధులను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..